హీరోయిన్ జెనీలియా పెళ్లి తర్వాత కూడా అదే వృత్తిలో కొనసాగతాను అంటోంది. నటుడు రితీశ్ దేశ్ ముఖ్ ని ఫిబ్రవరి 3న పెళ్లాడబోతున్న జెనీలియా ఈ విషయమై మాట్లాడుతూ....పెళ్లి తర్వాత కూడా నటిస్తాననీ, నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది. అయితే పెళ్లి తర్వాత కొంత కాలం బ్రేక్ ఇస్తానని, తన ఫెవరెట్ నటి కాజోల్ మాదిరి పెళ్లి తర్వాత కూడా నటిస్తానని అంటోంది.
తమ పెళ్లి కుటుంబ వ్యవహారంగానే జరగబోతోందనీ, సినిమా రంగానికి చెందినవాళ్లు కొద్దిమందే దానికి హాజరవుతారనీ ఆమె చెప్పింది. సినిమా కెరీర్ సంగతేమిటనే ప్రశ్నకు పెళ్లయ్యాక కూడా నేను నటిస్తా. అయితే ఎప్పటిదాకా అనేది మాత్రం చెప్పలేను" అని తెలిపింది.
పెళ్లి తర్వాత ఓ నెల వరకు జెనీలియా షూటింగులకు వచ్చే పరిస్థితి లేనందున ఇప్పటికే జెనీలియాతో సినిమాలు కమిట్ అయిన దర్శక, నిర్మాతలు డేట్స్ విషయంలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. రితేష్ దేష్ ముఖ్ తో సినిమాలు చేస్తున్న వారి పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే..
బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత దక్షిణాది సినిమాలు తగ్గించిన జెనీలియా ప్రస్తుతం తెలుగులో రాణాతో ‘నా ఇష్టం’ సినిమా మాత్రమే చేస్తోంది. హిందీలో రాక్ ద షాది, ఇట్స్ మై లైఫ్, తెరే నాల్ లవ్ హోగయా తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Post a Comment