.
Home » » వర్మ హీరోయిన్ తో 'గబ్బర్ సింగ్'లో ఐటం సాంగ్

వర్మ హీరోయిన్ తో 'గబ్బర్ సింగ్'లో ఐటం సాంగ్

Written By Hot nd spicy on Sunday, 25 March 2012 | 07:05


Share


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్‌సింగ్‌'లో ఐటం సాంగ్ ఎవరు చేస్తారు అన్నదానికి చాలా రోజులుగా అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే రీసెంట్ గా వర్మ చిత్రం అందంలో హీయిన్ గా చేస్తున్న బ్రెజిల్ మోడల్ సతాలియాని ఈ ఐటం సాంగ్ కి ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి 'దబాంగ్‌' అనగానే 'మున్నీ బద్‌నామ్‌'పాటే గుర్తొస్తుంది. ఇప్పుడు 'దబాంగ్‌' స్ఫూర్తితో వస్తున్న 'గబ్బర్‌సింగ్‌'లోనూ ఆ తరహా పాటే హైలెట్ అవనుంది. అందులోనూ ఐటం సాంగ్ లు అంటే ప్రత్యేకమైన శ్రద్ధపెట్టే దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అంటే మరో 'డియాలో.. డియాలో' స్థాయి మెరుపుల్ని ఆశించవచ్చని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ పాటలో కనిపించే ఆమె ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నతాలియా విషయానికి వస్తే.... కింగ్ ఫిషర్ 2012 కేలండర్ లో తన అందాలతో అదరకొట్టిన బ్రెజిల్ మోడల్ ఆమె . ఆమె ప్రస్తుతం వర్మ చేస్తున్న డిపార్టమెంట్ లో ఐటం సాంగ్ చేస్తోంది. రానా సరసన అందం చిత్రంలోనే కాక మరో చిత్రంలోనూ చేస్తోంది.

Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger