![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEggkQWBowR8zUXGKCbVzciI9kvYjROAU88GX-b3BKgbBz1qWeQ06V55lWIhFXohd_fu7v793KrWtrY94HsrEg0HT0hq46zQtkxBF51qt6u_80Wcohmk9kZOTKpD5n9hsT8pnYOgm_Nhlmul/s1600/25-mumaith-khan.jpg)
ఆ మద్యన ముమైత్ ఖాన్ ప్రధానపాత్రలో మైసమ్మ,మంగతాయారు టిఫెన్ సెంటర్,అపరేషన్ ధుర్యోధన వంటి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. కానీ ఆ తర్వాత ఆమె మెల్లిగా ఫేడవుట్ అయ్యిన తర్వాత ఆమె సినిమాలు ఏమీ రాలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన 'నిప్పులాంటి నిజం' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. మాళవిక, ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమా వివరాలను నిర్మాత అర్జునరెడ్డి చెబుతూ 'ఇంతవరకూ రానటువంటి కథాంశంతో రూపుదిద్దుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో 23 రోజుల పాటు షూటింగ్ చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణ. ఏప్రిల్‌లో ఆడియోను, మే నెల్లో సినిమాను విడుదల చేస్తాం. శేఖర్ అందించిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 'పెద్దాపురం పాప' అనే పాట యూత్‌ని అలరిస్తుంది' అన్నారు. జానకిరామ్, మాళవిక, ముమైత్‌ఖాన్, షకీల, ఆలీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, జోగి బ్రదర్స్, కొండవలస తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సాహితి, ఫొటోగ్రఫీ: రమేష్‌కుమార్, సంగీతం: శేఖర్, ఎడిటింగ్: మోహన్-రామారావు,సహ నిర్మాత: పావులూరి విజయేంద్రకుమార్, సమర్పణ: అన్నమయ్య క్రియేషన్స్, నిర్మాత: అర్జున్‌రెడ్డి, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ పొన్నాడ.
Post a Comment