కరీనా కపూర్ కి బాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉన్నంత వాల్యూ ఉంది. అయితే ఆమె రెమ్యునేషన్ మాత్రం ఎనిమిది కోట్లు దాటటం లేదు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...''ఎంతసేపటికి ముగ్గురు లేదా నలుగురు ఖాన్‌ల కోసం బాలీవుడ్‌లో కథలు వండుతుంటారు. హీరోయిన్ల పని వారి పక్కన డ్యాన్సులు వేయటమే. మేమంతా కూడా షారూఖ్ లేదా సల్మాన్ ఖాన్‌ల వెనుక నిలబడి... ఇదిగో.. మేమిక్కడ ఉన్నాం.. నటించటానికి మాక్కాస్త అవకాశం ఇవ్వండి.. సల్మాన్‌కు ఎంత ఇస్తున్నారు.. నాకు ఎంత ఇస్తున్నారు?'' అని ఎలుగెత్తి అరవాలని ఉంటుందని అంది.
ఇలాగే ''నేను హీరోను కాను. ఎందుకంటే 'త్రీ ఇడియట్స్', 'రా.వన్', 'బాడీగార్డ్' లాంటి సినిమాలన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేశాయి. ఆ సినిమాల నిర్మాతలు, ముగ్గురు ఖాన్‌లు వారి సొమ్ము ఇళ్లకు తీసుకువెళ్లారు. 'ఛమ్మక్ ఛల్లో'తో నాకేం మిగిలింది?'' అని కరీనా ప్రశ్నించింది. వారికిస్తున్నంత పారితోషం నేను పొందటంలేదు. వారిలా నన్ను చూడటంలేదు. కానీ దాని కోసం పోరాటం చేస్తాను. ఏదో ఒకరోజున వారితో సమానమైన పారితోషకం గడిస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం.. భగవంతుడు చాలా కరుణామయుడని నమ్ముతాను. ఎక్కడో ఒకచోట నా కష్టానికి గుర్తింపు వస్తుందని అంది. ప్రస్తుతం ఆమె మాధుర్ బండార్కర్ తీస్తున్న 'హీరోయిన్' చిత్రంలో నటిస్తున్నందుకు రూ.8 కోట్లు వసూలు చేస్తోంది.

Post a Comment