త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న సినిమాలోని పాటలకు స్టెప్పులు వేయడానికి టాలీవుడ్ నెంబర్‌వన్ డాన్సింగ్ హెరో అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. 'బన్నీ', 'ఆర్య', 'దేశముదురు', 'ఆర్య2' వంటి సినిమాలో వంట్లో ఎముకలు లేనట్లు డాన్స్ చేసిన అర్జున్ 'బద్రీనాథ్'లో మరింత క్లిష్టమైన స్టెప్పులేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. ఫలితంగా 2011 ఆగస్టులో పెర్త్‌లోని సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ హాస్పిటల్లో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. ఆర్నెల్ల పాటు డాన్సులకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించడంతో డాన్సుల ప్రియుడైన అర్జున్ ఇప్పటివరకు టాకీ సన్నివేశాల్లో నటిస్తూ వచ్చాడు.
ఇప్పుడు ఆ భుజం గాయం పూర్తిగా తగ్గిపోయిందనీ, అందువల్ల అతను పాటల్లో స్టెప్పులు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడనీ అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా పాటల చిత్రీకరణకు త్రివిక్రం రెడీ అవుతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నాయికగా గోవా బ్యూటీ ఇలియానా నటిస్తోంది.
Post a Comment