నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఆటో నగర్ సూర్య. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మార్చి 27నుంచి,30 తేదీ వరకు హైదరాబాద్ రోడ్డులపై జరగనుంది. రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట సినిమాలో హైలెట్ అవుతుందని చెప్తున్నారు. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందని టాక్.. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం వేసవిలో షూటింగ్ జరుపుకోనుంది.
ఇక ఈ చిత్రంలో నాగచైతన్య విజయవాడ ఆటో నగర్ ఏరియాకు చెందిన రౌడీగా కనపించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల.. ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు. ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో.. హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం.మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దేవాకట్టా.

Post a Comment