అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయిని ఆస్వాదిస్తున్న తారల్లో కేరళ కుట్టి అమలా పాల్ కూడా చేరిపోయింది. తెలుగులో చేసిన తొలి సినిమా 'బెజవాడ' అట్టర్ ఫ్లాపవడంతో ఇక్కడ అంత డిమాండ్ ఏర్పడకపోయినా తమిళంలో మాత్రం ఆమె హవా నడుస్తోంది.
ఇప్పటికే అక్కడ రూ. 80 లక్షల పారితోషికం తీసుకుంటున్న ఆమె తాజాగా ఓ సినిమాలో నటించేందుకు ఏకంగా రూ. కోటి డిమాండ్ చేసిందని తెలుస్తోంది. జయం రవి హీరోగా నటిస్తున్న 'బూలోగం' (తెలుగు అర్థం 'భూలోకం')లో నటించేందుకు ఆమె అడిగిన ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు ఆ సినిమా నిర్మాత సరేనన్నాడని వినిపిస్తోంది.
తెలుగులో ప్రస్తుతం ఆమె రాంచరణ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసే ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తెలుగులో ఒక్క హిట్ కొట్టిందంటే ఇక్కడ కూడా ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయవచ్చు.
Post a Comment