తెలుగులో ప్రస్తుతం 'దరువు', 'షాడో' వంటి పెద్ద సినిమాల్లో నటిస్తున్న పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ తెలుగు ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అంటోంది. మీ అందరిలో ఒకదానిగా ప్రతి ఒక్కరూ నన్ను తెలుగమ్మాయిలా ఆదరించాలనే ఉద్దేశంతో తెలుగు నేర్చుకున్నా. మన పాత్రలోని భావోద్వేగాలు మనకే బాగా తెలుస్తాయి. సొంత డబ్బింగ్ వల్ల మనం పోషించిన పాత్రకు వంద శాతం న్యాయం చెయ్యగలుగుతాం అని ఆమె చెప్పింది.
ఆమెకి ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడమే ఇష్టం.మా అమ్మానాన్నల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పనీ చేయను. ఒకవేల ప్రేమ వివాహం చేసుకోవాల్సి వస్తే పెద్దల్ని మెప్పించే చేసుకుంటా. అయితే నన్ను పెళ్లాడేవాడు నన్ను నన్నుగా ప్రేమించ గలగాలి. తనకు నేనే సర్వస్వం అనే భావన కలిగించాలి. ఎంతమంది ముందైనా సరే నాకోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి" అని తన మనసులో మాటలు తెలిపింది తాప్సీ.
Post a Comment