ప్రభుదేవాతో ప్రేమాయణం, పెళ్లి ప్రతిపాదనల నేపథ్యంలో సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్న నయనతార ఆ తర్వాత ప్రభుతో బంధం తెగి పోవడంతో సినిమాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గతంలో టాప్ పొజిషన్లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగిన నయన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో అవకాశాలు ఆమె కోసం క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే నయనతార నాగార్జునతో ఓ సినిమాకు, గోపీచంద్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పడంతో పాటు...ఇతర భాషల్లోనూ మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పింది. వీలైనంత త్వరగా ఎక్కువ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మళ్లీ టాప్ పొజిషన్ కి వెళ్లడంతో పాటు డబ్బు సంపాదించుకోవాలనేదే ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.
ఇతర హీరోలకు గతంతో తీసుకున్న రేటే చెబుతున్న నయనతార...ఇటీవల తన పాత ప్రియుడు శింబుతో చేసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకమైన రేటు చెప్పిందట. అతనితో చేయాలంటే రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. ఈ ఇద్దరి కాంబినేషన్ అయితే సాధారణంగానే అంచనాలు పెరుగుతాయి, అందుకే నయనతార రేటు పెంచినట్లు చర్చించుకుంటున్నారు.
శింబు నటించనున్న ‘వల్లు’ అనే తమిళ సినిమాలోకి నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ అనే న్యూ కమర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి అమ్మ రాజశేఖర్ కో ప్రొడ్యూసర్ కాగా, నిక్ ఆర్ట్స్ చక్రవర్తి ప్రొడ్యూసర్. నయనతార అంత రేటు చెబుతుండటంతో దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment