.
Home » » క్రైస్తవ మత వివాదంలో ఎ.ఆర్‌.రెహ్మాన్‌

క్రైస్తవ మత వివాదంలో ఎ.ఆర్‌.రెహ్మాన్‌

Written By Hot nd spicy on Wednesday, 25 January 2012 | 08:24

ఆస్కార్‌ పురస్కార విజేత ఎ.ఆర్‌.రెహ్మాన్‌ వివాదంలో చిక్కుకున్నాడు. 'ఏ మాయచేశావె'హిందీ వెర్షన్ ఏక్‌ దివానా థా' హిందీ చిత్రానికి సంబంధించిన ఒక పాటలో 'హోసన్న' పదాన్ని వాడటంపై ఒకానొక క్రైస్తవ వర్గం అభ్యంతరాలతో వివాదం మొదలైంది. దీనిపై రహమాన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయటం తన అభిమతం కాదని రెహ్మాన్‌ పేర్కొన్నాడు. ముంబాయికి చెందిన క్రిస్టియన్‌ సెక్యూలర్‌ ఫోరమ్‌(సిఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి జోసెఫ్‌ డియాస్‌ సినిమా పాటలో 'హోసన్న' పదం వాడటంపై అభ్యంతరాలు లేవెనత్తారు. అది క్రైస్తవులు, యూదులు ప్రార్ధనల్లో ఉపయోగించే అతి పవిత్రమైన పదంగా పేర్కొన్నారు. కానీ ఆ పదాన్ని వాడటంలో ఎలాంటి తప్పు లేదని రెహ్మాన్‌ అభిప్రాయపడ్డాడు.

ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''ఏదైనా సినిమాకు పనిచేసేటప్పుడు దానికి సంబంధించిన పరిశోధనకు పలు మాసాలు కేటాయిస్తాను. 'ఏక్‌ దివానా థా' చిత్రానికి అలాగే చేశాను. ఈ పాటలో 'హోసన్న' పదాన్ని వాడటంపై నా మిత్రుల్లో క్రైస్తవులను సంప్రదించాను'' అని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 2010లో విడుదలైన తెలుగు వెర్షన్‌ 'ఏ మాయచేశావె' చిత్రంలో ఒక పాటలో 'హోసన్న' పదం ఉంది. దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో ఆ పాట విడుదలైనప్పుడు పెను సంచలనం సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలు దాన్ని ఆదరించారు. పలు పురస్కారాలు కూడా దక్కించుకుంది. ఈ పాట ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే నేను తీవ్రంగా విచారిస్తున్నాను ఆయన అన్నారు.

ఆయనకు గీత రచయిత జావేద్‌ అక్తర్‌కు సైతం సపోర్టుని ఇస్తూ...ఆ పాటలో ఎలాంటి తప్పు కనిపించలేదు. రెహ్మాన్‌ లాంటి మానవతావాది, ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరి మనోభావాలు గాయపరిచే విధంగా పాటలు రాయాలనుకోము. మేమెందుకు అలా చేస్తాం ప్రశ్నించారు. ప్రతీక్‌, అమీ జాక్సన్‌ జంటగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger