పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్' చిత్రం పేరెత్తగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అంత్యాక్షరీ కామెడీ సీన్. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్‌గా నిలిచింది. కేవలం ఈ సీన్ చూడటానికే మళ్లీ మళ్లీ సినిమాకెళ్లినవాళ్లు ఎన్నారంటే అతిశయోక్తి కాదేమో. చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ సీన్లో నటించిన కమెడియన్స్ తన నివాసానికి రావడంతో తొలి సారిగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు పవర్ స్టార్. మీరు చూస్తున్న ఫోటో అదే.
ప్లాప్ వచ్చినా, హిట్ వచ్చినా పవర్ స్టార్ ఒకే తీరుగ ఉంటారు. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. ప్రతి సినిమా అభిమానులను, ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశ్యంతోనే చేస్తామని, కృషి లోపం ఉండదని చెబుతుంటారు. అయితే జయాపజయాలు మన చేతుల్లో ఉండదనేది పవర్ స్టార్ నమ్మకం.
హిట్టొచ్చింది కదా అని హడావుడి చేసే నైజం పవన్ కళ్యాన్‌కు లేదు. అందుకే గబ్బర్ సింగ్ సెలబ్రేషన్స్ హడావుడి ఇప్పటి వరకు కనిపించలేదు. కలెక్షన్లు పేరు చెప్పి గొప్పలు చెప్పుకోవడం కూడా పడని పవర్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్‌కు ఈ విషయం గట్టిగా చెప్పారు. అందుకే ‘గబ్బర్ సింగ్' చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా దూసుకెలుతోంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది.
సినిమా విడుదలకు ముందే ఆడియో కూడా కెవ్వు కేక పెట్టించింది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా హాజరు కానున్నారు. ‘గబ్బర్ సింగ్' విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని షీల్డ్‌తో సత్కరించనున్నారు. ఈ మేరకు ప్రత్యేకగా షీల్డ్ డిజైన్ చేయించారు.
హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం. పవర్ స్టార్ వస్తాడని తెలియడంతో ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందా...తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్
Share with Friends : |
Share with Friends : |
Post a Comment