రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఈగ' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. జులై 6న విడుదలైన ఈచిత్రం తొలి రోజు స్టార్ హీరోల లెవల్లో కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈగ' తొలి రోజు కలెక్షన్లు ప్రాంతాల వారిగా ఇలా ఉన్నాయి.
‘ఈగ' ఏపీ ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం - 1.65 కోట్లు
సీడెడ్ - 1.05 కోట్లు
ఈస్ట్ - 0.40 కోట్లు
వెస్ట్ - 0.29 కోట్లు
కృష్ణా - 0.32 కోట్లు
వైజాగ్ - 0.30 కోట్లు
నెల్లూరు - 0.18 కోట్లు
గుంటూరు - 0.49 కోట్లు
టోటల్ ఏపీ - 4.68 కోట్లు
సీడెడ్ - 1.05 కోట్లు
ఈస్ట్ - 0.40 కోట్లు
వెస్ట్ - 0.29 కోట్లు
కృష్ణా - 0.32 కోట్లు
వైజాగ్ - 0.30 కోట్లు
నెల్లూరు - 0.18 కోట్లు
గుంటూరు - 0.49 కోట్లు
టోటల్ ఏపీ - 4.68 కోట్లు
ఇవి కేవలం మన రాష్ట్రంలోని కలెక్షన్ల వివరాలు మాత్రమే. ఈగ చిత్రం తమిళం ‘నాన్ఈ' పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళల్లో ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. ఓవర్సీస్‌లో కూడా భారీగా థియేటర్లు కేటాయించారు. అక్కడి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఒక ఏపీలోనే తొలి రోజు దాదాపుగా రూ. 5 కోట్లు వసూలు చేసిన ఈగ అన్ని చోట్ల వచ్చిన కలెక్షన్లు కలుపుకుంటే స్టార్ హీరోలు నెలకొల్పిన రికార్డులు బద్దలు కొడుతుందేమో.
వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ గాలి వార్త ప్రకారం ఇండియా మొత్తం ఈచిత్రం తొలి రోజు రూ. 10 నుంచి 12 కోట్లు వసూలు చేసిందని, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లు వసూలు చేసింది తెలుస్తోంది. అయితే ఈ వార్త నిజమా? కాదా? అనేది ఇంకా అఫీషియల్ గా ఖరారు కావాల్సిఉంది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మించారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment