టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడంతో పాటు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండింటిలోనూ మంజుల పెద్దగా రాణించలేక పోయింది. దీంతో మంజుల దృష్టి తాజాగా యాక్టింగ్ స్కూల్‌పై పడింది.
సినిమా వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందులో ప్రవేశించే వారు కూడా ఎక్కువే అయ్యారు. ఈ నేపథ్యంలో సొంతంగా ఓ యాక్టింగ్ స్కూల్ ప్రారంభించాలనే యోచనలో ఉందట మంజుల. మహేష్ బాబు అప్పుడప్పుడు రప్పించి టిప్స్ చెప్పిస్తే ఆ స్కూల్‌కి పాపులారిటీ కూడా బాగా పెరుగుతుందనే ఆలోచనలో మంజుల ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఇప్పటికే నాగార్జున కుటుంబం అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఫిల్మ్ స్కూల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ స్కూల్ జేఎన్టీయూ యూనివర్సీటితో ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుని ఇంటర్నేషనల్ లెవల్లో దూసుకుపోవడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబం కూడా ఆ రంగంలో రాణించాలని మంజుల ఆశిస్తోంది. మంజుల ఆలోచనలకు మహేష్ బాబు సపోర్టు కూడా ఉంటే త్వరలోనే ఓ నిర్ణయం వెలువడవచ్చు.
మంజుల ఇప్పటి వరకు కావ్యాస్ డైరీ, షో, ఆరెంజ్ చిత్రాల్లో నటించింది. నిర్మాతగా నాని, పోకిరి, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావె, షో చిత్రాలను ప్రొడ్యూస్ చేసింది. వాటి తర్వాత చాలా కాలం పాటు సినిమా వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా చేస్తున్న సరికొత్త ఆలోచనలు ఏ మేరకు ఆచరణకు నోచుకుంటాయో చూడాలి.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment