ఐశ్వర్య బరువు గురించి మాట్లాడేందుకు వాళ్లెవరు..? అభిషేక్ ప్రశ్న
తన భార్య ఐశ్వర్యా రాయ్ బరువు పెరిగిందనీ, ఇంకా ఏవో వార్తలు రాస్తూ వివాహమై తల్లి అయిన ఐష్ గురించి వార్తలు రాయడాన్ని అభిషేక్ బచ్చన్ తప్పుపట్టారు. ఐశ్వర్యా రాయ్ పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ ఆమె ఇప్పుడు గృహిణి కదా అని అన్నారు. పెళ్లయిన ఓ మహిళ వ్యక్తిగతంలోకి తొంగి చూడటం సమంజసం కాదనీ, తమ కుటుంబానికి ఎంతో ప్రజాదరణ ఉన్నదనీ, కొన్ని పత్రికలు ఏవో పిచ్చి రాతలు రాస్తూ ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. అయినా తాము అవేవీ పట్టించుకోమని చెప్పుకొచ్చారు. ఐశ్వర్యా రాయ్ వ్యక్తిగత విషయాల గురించి పత్రికలు రాసే అభూత కల్పనలతో విసుగు చెందిన అభిషేక్ పైవిధంగా స్పందించారు. మరి మీడియా ఐశ్వర్యా రాయ్‌ను వదులుతుందా... చూడాలి.
Post a Comment