వెంకటేష్, శ్రీకాంత్ హీరోలుగా, తాప్సీ, మధురిమ హీరోయిన్లుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'షాడో'. ఎ యునైటెడ్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6 గా పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు ఇటీవల రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మూవీ మొఘల్ డా||డి.రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మొదటి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలలో హీరోలు విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, హీరోయిన్లు తాప్సీ, మధురిమ, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత పరుచూరి కిరీటి, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాటల రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ... కేవలం పది రోజుల్లోనే ఈ కథను తయారు చేశాము. టైటిల్, వెంకటేష్ లుక్ చూసి బాలీవుడ్ సినిమాలా ఉన్నా పక్కా తెలుగు సినిమా. పరుచూరి కిరీటి ఎంతో భారీగా నిర్మించే ఈ మల్టీస్టారర్ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ తరహాలోనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపు దిద్దుకోనుంది. వెంకటేష్, శ్రీకాంత్ పాత్రలతో పాటు తాప్సీ పాత్ర చాలా ఎనర్జీగా ఉంటుంది'అన్నారు.
తాప్సీ మాట్లాడుతూ... వెంకటేష్, శ్రీకాంత్ లాంటి పెద్ద స్టార్స్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ పర్‌ఫెక్ట్ తర్వాత మరోమారు ఆస్ట్రేలియా వెళ్లడం హ్యాపీగా ఉందన్నారు. సంగీత దర్శకుడు యస్.యస్.తమన్ మాట్లాడుతూ... వెంకటేష్ గారితో 'బాడీగార్డ్' తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఇక మెహర్ రమేష్ గారితో' అమ్మా నాన్న తమిళమ్మాయి' నుండి పరిచయం. మంచి సంగీతం అందించడానికి కృషి చేస్తాను' అన్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ... చాలా తక్కువ సమయంలో వెంకటేష్ గారితో పనిచేస్తుండడం చాలా ఆనందంగా ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ పూర్తిస్థాయి మల్టీ స్టారర్ సినిమాకి స్క్రీన్‌ప్లే అద్భుతంగా కుదిరింది. 'సింహా' తర్వాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సనిమాలో వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీలతోపాటు మధురిమ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌లతో పాటు, ముంబై, హైదరాబాద్‌లలో చిత్రీకరించడం జరుగుతుంది. అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళతాము' అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ... నా కెరీర్‌లో గుర్తించుకోదగ్గ మరో పెద్ద కమర్షియల్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కూడా చాలా మంచిపాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము' అన్నారు.

Post a Comment