ముంబై: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీక్వీన్ దీపికా పడుకునేతో కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతూ దర్శనమిచ్చి సిద్దార్థ మీడియాలో తరచుగా కనిపిస్తుం డేవాడు. కానీ కొద్ది రోజుల క్రితం దీపికా, సిద్దార్థల మధ్య మనస్పర్థలు వచ్చి వారిద్దరూ విడిపోయారనే వార్తలు వినిపించాయి. సిద్దార్థ ఒంటరిగా పార్టీలకు హాజరవుతుండటం కూడా ఈ గాసిప్స్‌కి బలం చేకూర్చించింది.
అయితే ఈ విషయాన్ని ఖండిస్తూ తాజాగా సిద్ధార్థ దీపిక గురించి ప్రకటన చేశారు. దీపిక నాకు చాలా దగ్గరి క్లోజ్ ఫ్రెండ్. నేనంటూ ఆమెకోసం ఎప్పటికీ ఉంటా. ఆమె నటించిన కాక్ టెయిల్ మూవీ సూపర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ తెలుపుతున్నాం. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దీపిక పడుకొనె రజనీకాంత్‌తో ‘కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్, ఈ చిత్ర హీరోయిన్ దీపిక పడుకొనె జపాన్ టూర్ కు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 12.12.12న విడుదలవుతోంది.
ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో మరో మూడు ప్రాజెక్టులు చేస్తోంది. సైఫ్ అలీఖాన్ హీరోగా అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రేస్ 2' చిత్రంలో, రణబీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యే జవానీ హై దివానీ' చిత్రంలో, షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందబోయే ‘చెన్నయ్ ఎక్స్ ప్రెస్' చిత్రంలో నటించనుంది.

Post a Comment