.
Home » » పవన్ కళ్యాణ్‌ను దర్శకునిగా కాదు.. అభిమానిగా చూశా: హరీశ్‌ శంకర్‌

పవన్ కళ్యాణ్‌ను దర్శకునిగా కాదు.. అభిమానిగా చూశా: హరీశ్‌ శంకర్‌

Written By Hot nd spicy on Sunday, 13 May 2012 | 04:21

స్టేజీ ఆర్టిస్టుగా, రచయితగా, సినీ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన హరీష్‌ శంకర్‌ ఒక్కసారిగా రవితేజ 'మిరపకాయ్‌'తో వెలుగులోకి వచ్చాడు. ఆ చిత్రం ఇచ్చిన విజయంతో మరో చిత్రానికి పనిచేయడానికి అవకాశం వచ్చింది. అదే పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం శుక్రవారంనాడు విడుదలైంది. అన్నిచోట్ల మంచి టాక్‌ రావడంతో ఆయన్ను వెబ్‌దునియా పలుకరించింది. ఆ విషయాలు మీకోసం.

టైటిల్‌లో మాటలు, మార్పులు, దర్శకత్వం అని వేయడానికి కారణమేమిటి?
రీమేక్‌ చేసేటప్పుడు కామన్‌‌గా అందరూ అడుతుంటారు. యాజటీజ్‌గా చేస్తున్నారా? మార్పులు ఏమైనా చేస్తున్నారా?అని. దబాంగ్‌ సినిమా అనేది యు.పి. బ్యాక్‌డ్రాప్‌తో తీశారు. సల్మాన్‌ఖాన్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ అది. ఆ సినిమా చూసినవారంతా మన నేటివిటికీ సరిపడుతుందని అన్నారు. అందుకనే కొద్దిగా మార్పులు చేశారు. స్క్రీన్‌ప్లే బదులు 'మార్పులు' అని వేయడం జరిగింది. సినిమా చూసే ప్రేక్షకుడి మైండ్‌ ముందుగా సెట్‌ చేయడానికే అలా వేశాం.

విడుదల తర్వాత దర్శకుడిగా మీ ఫీలింగ్‌ ఎలా ఉంది?
నేను ముందుగా పవన్‌ కళ్యాణ్ అభిమానిని. కాలేజీ డేస్‌లో ఆయనలా స్టైల్‌ను మెయింటేన్‌ చేయడం, దుస్తులు కట్టుకోవడం చేశాను. సినిమా ఛాన్స్‌ వచ్చాక.. ఆ బాధ్యత మరింత పెరిగింది. దర్శకునిగా నా ఆలోచనల్ని పెట్టాను. ఈ సక్సెస్‌ను దర్శకుని కంటే ఫ్యాన్‌గా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను.

పవన్‌ కళ్యాణ్‌ మీకే దర్శకత్వం ఇవ్వడానికి కారణం?
నేను ఇంతకుముందు చేసిన 'మిరపకాయ్‌' మంచి హిట్‌ అయింది. అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా డీల్‌ చేశావనే ప్రశంసలు కూడా వచ్చాయి. నేను పవన్‌ అభిమానినని ఆయనకు తెలుసు. ఓసారి షడన్‌గా పవన్‌ కళ్యాణ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. వెంటనే వెళ్ళాను. 'దబాంగ్‌' సినిమా రీమేక్‌ చేస్తున్నాం. దానికి దర్వకత్వం వహించమన్నారు.

ముందు నేను షాక్‌ అయ్యాను. ఆ వెంటనే తేరుకుని దీన్ని బ్లాక్‌బస్టర్‌గా చేయడానికి కృషి చేస్తానని చెప్పాను. అసలు ఈ సినిమాను ఆయనే నిర్మించాలి. నేను మొదట ఫిక్స్‌ అయ్యాక... గణేష్‌ నిర్మాతగా వచ్చాడు. ఆ తర్వాత రచయితలు వచ్చారు.

ఇండస్ట్రీలో ఎలాంటి స్పందనలు విన్నారు?
ముందుగా వినయ్‌ ఫోన్‌ చేసి.. పవన్‌-హరీష్‌ వేడి మొదలైంది అన్నారు. రచయిత కోన వెంకట్‌, పదేళ్ళుగా పవన్‌ను ఇలాగే చూడాలనుకుంటున్నారు అని కామెంట్‌ చేశాడు. రాజమౌళి తన ట్విట్టర్‌లో- చాలాకాలం ఎదరుచూస్తున్న పవన్‌ సక్సెస్‌ ఇది అన్నారు. వంశీ పైడిపల్లి మాత్రం- ఖుషి తర్వాత పవన్‌ను అంత అందంగా చూపించారని అదే సక్సెస్‌కు కారణమన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ పాజీటివ్‌ టాక్‌తో మాట్లాడారు. ఏ ఒక్కరూ నెగెటివ్‌గా మాట్లాడలేదు.

థియేటర్లలో స్పందన ఎలా ఉంది?
హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో నేను, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు, నిర్మాత గణేష్‌ చూశాం. థియేటర్‌ అంతా ఆనందం గోలగోలగా ఉంది. ఇదే రెస్పాన్స్‌ అమలాపురం నుంచి అమెరికా వరకు ఒకేలా ఉంది.

అంత్యాక్షరిలో హీరోల్ని ఇమిటేట్‌ చేయడానికి కారణం?
పవన్‌ కళ్యాణ్‌ రౌడీల చేత అంత్యాక్షరి నిర్వహిస్తాడు. ఆ దశలో ఒక్కో రౌడీ తనకు వచ్చిన పాటల్ని పాడుతూ ఆయా హీరోలను అనుకరిస్తాడు. ఇది ఫ్యాన్సే కాదు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. థియేటర్లలో కుర్చీల్లోంచి ఎగబడి నవ్వుతున్నారు. నేను హీరోల్ని అనుకరించడం చూపాను. కానీ అవమానించలేదు. అంతెందుకు.. పవన్‌ కళ్యాణ్‌ను శ్రీను అనే రౌడీ ఇమిటేట్‌ చేస్తాడు. అతని మీద అతనే చేసుకున్నాడు. ఆ సన్నివేశాన్ని పవన్‌ ఒప్పుకున్నాడు.

సినిమా విడుదలకు ముందు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరిగింది?
అవును. సినిమా చూడకముందు రకరకాలుగా ఊహించుకున్నారు. కానీ థియేటర్లలో సినిమా చూశాక... వారు అభినందిస్తున్నారు. సహజంగా రౌడీల నుంచి నిజాలు రాబట్టడానికి థర్డ్‌ డిగ్రీ, ఫోర్త్‌ డిగ్రీ వంటివి ఉపయోగిస్తుంటారు. కానీ పాజిటివ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌లోనూ గబ్బర్‌సింగ్‌ ఎలా రాబట్టాడనేది చూసి.. చాలా మెచ్చుకున్నారు.

'దబాంగ్‌'లో హీరో విలన్‌తో కలుస్తాడు. కానీ ఇందులో...?
అది వారికి కొత్తగా ఉంది. కానీ మన వారికి ఇది అయితేనే కరెక్ట్‌.

పవన్‌ ఒన్‌మ్యాన్‌ షోగా చేశారు?
అవును. ఏదో సందేశం ఇవ్వాలని, సినిమా తీయలేదు. నేను పవన్‌ కళ్యాణ్‌ను ఎలా చూడాలనుకున్నానో అలా చూపించాను. కథను బట్టి ఆయన్ను అలా డిజైన్‌ చేశాం.

డాన్స్‌ పవన్‌ ఎక్కువగా చేశాడు?
అవును.. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఒకప్పటి హిట్‌ చిత్రాల్లో చేసినట్లుగా చేశాడు. తొలిప్రేమ, తమ్ముడులో బాగా చేశాడు. ఎందుకు మళ్ళీ చేయరని అడిగాను. పాట కథను ముందుకు తీసుకెళ్ళాలి. అలా పాటను తీసుకురా? నేను చేసి చూపిస్తానన్నారు. అలా పాట రాశాక... దేవీశ్రీ మ్యూజిక్‌తో ఆయన స్టెప్‌లు ఇరగదీశారు.

పవన్‌ తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?
సినిమా తీసేటప్పుడు ఒక్కటే చెప్పారు. మనం సినిమా తీస్తున్నాం అంటే.. దానివల్ల యువత చెడిపోకూడదు. ఎంజాయ్‌ చేయాలి అన్నారు. అందుకే సన్నివేశంలో సిగరెట్‌ తాగే సీన్‌ 'దబాంగ్‌'లో ఉంది. మందు కొట్టడం చూపారు. కానీ అలా వద్దని... సిగరెట్‌ స్మోకింగ్‌ కూడా ఎంకరేజ్‌ చేయకూడదని... దాన్ని ఓన్లీ చేతిలో పెట్టుకుని... తన స్టైల్‌లో తాగకుండా చూపించారు.

సక్సెస్‌ లేని శ్రుతిహాస్‌ను తీసుకోవడానికి కారణం?
ఈ విషయం గురించి ఇండస్ట్రీకి చాలా చెప్పాలి. పోస్టర్‌ కొత్తగా ఉండాలని. ఆయనకు జంటగా కొత్తగా కూడా కన్పించాలని ఎన్నుకున్నాం. శ్రుతిహాసన్‌ ఇప్పటివరకు మోడ్రన్‌ పాత్రలు వేసింది. కానీ విలేజ్‌ అమ్మాయిగా... తాగుబోతు తండ్రి.. కుటుంబాన్ని పోషించలేకపోతే.. తనే చేతివృత్తులు చేసే కలంకారీ దుకాణాన్ని పెట్టి బతికిస్తుంది. ఇది మన నేటివిటికీ సరిపడేది.

శ్రుతి హాసన్‌ పేరు చెప్పగానే... చాలామంది నిర్మాతలు, టెక్నీషియన్స్‌... 'ఎందుకు ఆ అమ్మాయి.. అయితే ఫెయిల్యూర్‌' అన్నారు. మేం మే 11న రిలీజ్‌ చేయాలనే టెన్షన్‌లో ఉన్నాం. ప్రసాద్‌ ల్యాబ్‌లో అగ్రనిర్మాత కలిశాడు. మా సినిమా గురించి మంచి మాటలు మాట్లాడతాడని అనుకున్నాం. కానీ ఆయన కారు దిగి... 'శ్రుతి హాసన్‌ను పెట్టుకున్నారు. కొద్దిగా చూసుకోండి అన్నారు.' నా దృష్టిలో ఫెయిల్యూర్‌ ఒక పనిని సూచిస్తుంది. పర్సన్‌ను కాదు. అసలు ఆమె ఉండబట్టే సినిమా హిట్‌ అయింది. ఇక నుంచి ఆమె ఐరన్‌లెగ్‌ కాదు. గోల్డెన్‌ లెగ్‌.

మరి పవన్‌ కళ్యాణ్‌ కారణం కాదా?
అలా అనికాదు. గతంలో కూడా పవన్‌ కళ్యాణ్‌కు సరైన హిట్‌ లేదు. మళ్ళీ ఇప్పుడు ఖుషి అంత హిట్‌ వచ్చిందని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. దానికి హీరోయిన్‌ కూడా ఓ కారణం అంటున్నాను.

ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ ఏమన్నారు?
ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అభిమానులకు కావాల్సింది ఇచ్చాం. వారు మనకు కావాల్సింది ఇచ్చారన్నారు.

మీ తదుపరి చిత్రాలు?
ఇప్పుడు గబ్బర్‌సింగ్‌ సక్సెస్‌ మూడ్‌లో ఉన్నాం. త్వరలో వివరాలు తెలియజేస్తాను అని ముగించారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger