అల్లు అర్జున్ హీరోగా తెలుగులో పేరు తెచ్చుకుంటుంటే.. తమ్ముడు అల్లు శిరీష్ కూడా తనూ హీరో కావాలని అనుకున్నాడు. తొలి చిత్రంగా తెలుగులో కాకుండా తమిళంలో కాలుపెట్టాడు. అక్కడ రెస్పాన్స్‌ను బట్టి తెలుగులో ఏం చేయాలనేది ఆలోచిస్తాడు.
మరోవైపు అల్లు అర్జున్‌కు ఆర్య నుంచి మలయాళంలో క్రేజ్ ఏర్పడింది. తాజాగా తమిళంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. రాజేష్ అనే దర్శకుడు ఓ కొత్త కథను తయారు చేశాడు. అది రెండు భాషల్లో తీస్తే బాగా వర్కవుట్ అవుతుందని సూచించాడు.
ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ అమాయకుడి నుంచి మెచ్యూరిటీ లెవల్‌కు వెళుతుంది. రాజేష్ తీర్చిదిద్దిన స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఎవడు చిత్రంతో బిజీగా ఉన్న అర్జున్ ఆ తర్వాత మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక రెండు భాషల చిత్రంలోకి ప్రవేశించనున్నాడు. మరి అన్నదమ్ములిద్దరూ తమిళ ఇండస్ట్రీని ఏలేస్తారా! చూడాలిమరి!
Post a Comment