ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయాలెందుకు మొదలుపెట్టావ్.. బాలయ్య పంచ్
నటసింహం నందమూరి బాలయ్య సినిమా అంటే పంచ్ డైలాగుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాలకృష్ణ నటించిన అధినాయకుడులో కూడా ఇలాంటి డైలాగులే ఉన్నాయి. ఈ డైలాగులు ఎలాంటివో ఒక్కసారి లుక్కేస్తే...."
మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి గానీ, రోడ్డు మీద బొమ్మల్లో కాదు. ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలుపెట్టవో చెబుతావా..? చెప్పించమంటావా..?" అంటూ బాలయ్య పంచ్ డైలాగులున్నాయి. ఈ పంచ్ డైలాగులన్నీ ఎవరిని ఉద్దేశించి చెప్పినవన్నదానిపై చర్చ జరుగుతోంది. ఐతే కొందరు మాత్రం ఈ డైలాగులు ఖచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించినవేనని అంటున్నారు. సినిమా విడుదలయితే కానీ ఎవరిని ఉద్దేశించి ఈ పంచ్ లు పేల్చారో స్పష్టంగా తెలుస్తుంది.
Post a Comment