దాదాపుగా దశాబ్దకాలంగా చిత్రపరిశ్రమలో ఉంటున్న భామ అసిన్. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇపుడు బాలీవుడ్‌లో కొనసాగుతోంది. అక్కడ వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది.
ఈ ముద్దుగుమ్మ ఇపుడు పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఎక్కడా ప్రకటించలేదు కానీ బాలీవుడ్ పత్రికలు మాత్రం ఆమె గురించి ఈ వార్తను ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. 'గజినీ', 'రెఢీ', 'హౌస్‌ఫుల్-2' వంటి బాక్సాఫీసు హిట్లతో ఈ మళయాళి ముద్దుగుమ్మకు వయస్సు మీదపడిపోతోందట.
గజినీ తర్వాత ఏడాదికి రెఢీ వస్తే రెఢీ వచ్చిన తర్వాత కేలండర్ మారాక కానీ హౌస్‌ఫుల్-2 విడుదల కాలేదు. అలాగే దక్షిణాదిన కూడా ఇప్పుడు అసిన్‌ను అందరూ దాదాపు మరచిపోయారు. వచ్చిన కొన్ని అవకాశాలను చేజేతులారా కాదను కొన్న ఈమెను మాట్లాడించే దక్షిణాది సినీ రూపకర్తలు ఎవరూ లేరు.
ఇంత వరకూ మంచి హిట్స్‌లో నటించినా, వాటిలో తన పాత్రకు మంచి మార్కులే పడినా రాని అవకాశాలు బోలోబచ్చన్ తర్వాత అయినా వస్తాయనే నమ్మకం అసిన్‌లో కనపడలేదని, అందుకే దక్షిణాదిలో ఒక మంచి కుర్రాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని అసిన్ ఆలోచిస్తోందని అనేక బాలీవుడ్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో వేచి చూడాల్సిందే.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment