వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న(గురువారం)ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ ని విడుదల చేసి అందరి ప్రశంసలూ అందుకున్నారు. ఇక ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ 'సింపుల్ బట్ బ్యూటిఫుల్'గా నిర్ణయించారు. ఈ చిత్ర కథ కూడా ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఉంటుంది అని నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు.
దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ...‘‘మళ్లీ మల్టీస్టారర్ సినిమా ట్రెండ్ మా సంస్థ ద్వారా మొదలుకావడం ఆనందంగా ఉంది. ఈ కథ చెప్పగానే వెంకటేష్ వెంటనే అంగీకారం తెలిపారు. కేవలం పదిహేను నిమిషాలు కథ విని మహేష్ ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అని మాటిచ్చేశారు. ఈ సినిమా విషయంలో ఈ ఇద్దరు హీరోలు అందిస్తున్న సహకారం మరచిపోలేనిది’’ అని దిల్ రాజు అన్నారు. వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.
అలాగే ..‘‘కృష్ణగారి పుట్టిన రోజున ఈ టీజర్‌ని విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పాతికేళ్ల క్రితం ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారాయన. ఇప్పుడు ఆయన తనయుడు మహేష్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల ఈ స్క్రిప్ట్ కోసం ఎంత కష్టపడ్డాడో... ఇప్పుడు ఎంత కష్టపడి తీస్తున్నాడో నాకు పూర్తిగా తెలుసు. ఇప్పటికి 85 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో ఆర్‌ఎఫ్‌సీలో వేసే ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ జరుపుతాం. జూలైలో అవుడ్డోర్ షూటింగ్ ఉంటుంది. ఆగస్టులో మిగతాభాగం చిత్రీకరణ పూర్తిచేసి సెప్టెంబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
సమంత, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణి, రావురమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్నారు.
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్,
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్,
సంగీతం: మిక్కీ.జె.మేయర్,
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరామ్
సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment