తప్పిపోయిన తన భర్తను అన్వేషిస్తూ, గర్భవతి అయిన ఓ ఎన్‌ఆర్‌ఐ యువతి చేసే పోరాటం ఇతివృత్తంగా రూపొందిన చిత్రం 'కహానీ'. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ఆమె కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. విద్యాబాలన్ కి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తెలుగు,తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో దాంతో ఈ పాత్ర పోషించడానికి అనుష్క, నయనతార ఉత్సాహం, ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం వీరిద్దరిలోనూ ఎవరినీ ఎంచుకోవాలన్న విషయంలో తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిలో ఒకరిని ఖరారు చేస్తారని అంటున్నారు. ఎండోమాల్ ఇండియా సంస్థ ఈ కహానీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి హక్కులు తీసుకుని సన్నాహాలు చేసుకుంటోంది. అలాగే, చిత్ర దర్శకుడు లింగస్వామి, చక్రితోలేటి, సెల్వా వంటి దర్శకులలో ఒకరిని త్వరలో ఖరారు చేయనుందట. సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
అలాగే ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించి విడుదల చేయాలని యష్ రాజ్ సంస్ధ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్మాత ఆదిత్య చోప్రా ఇప్పటికే కహానీ బృందంతో చర్చలు సాగించారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్‌కి చెందిన విదేశీ విభాగం ద్వారా ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యేడాదే ఇది సెట్స్ మీదకు వెళ్తుంది. విద్యాబాలన్‌నే ప్రధాన పాత్ర పోషించమని కోరుతున్నాం..ఆని సంస్ద ప్రతినిధులు మీడియాకు తెలియచేసారు. అలాగే ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు దక్షిణాది నిర్మాతలూ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్త కహాని పెద్ద రికార్డునే క్రియేట్ చేసింది. కేవలం 8 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్చి 9 నుంచి 26 వరకు అంటే కేవలం 17 రోజుల్లోనే రూ. 43 కోట్లను వసూలు చేసి, బంపర్‌హిట్‌గా నిలిచింది 'కహానీ'. క్రితం సంవత్సరం వచ్చిన 'ద డర్టీ పిక్చర్'తో సూపర్‌హిట్ సాధించి, ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రూ. వంద కోట్ల మార్కును సాధించడమేమిటని అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసిన విద్యాబాలన్ తాజాగా మరో సూపర్‌హిట్ కొట్టడం అందరి హీరోలను ఆశ్చర్యంలో ముంచేసింది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment