"దూకుడు"ను పవన్ గబ్బర్ సింగ్ దూకేస్తాడట...!
దూకుడుతో ఒక్కసారిగా మహేష్‌బాబు కలెక్షన్ల వసూళ్ళలో రికార్డ్ బద్దలు కొట్డాడని వార్తలు రాగానే ఇతర హీరోలు కూడా తమ రికార్డ్‌ల పరిస్థితి ఏమిటని వాటిని కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ టైంలో మగధీర కలెక్షన్లు కూడా టాలీ చేశారు. ఎన్.టి.ఆర్. దమ్ము, రచ్చ కూడా అలా టాలీ చేసినవే. లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ కలెక్షన్లు మరో వారం రోజుల్లో దూకుడు రికార్డుల్ని బద్దలు కొడతాయని చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. మొదటినుంచి కలెక్షన్ల వివరాలు చెప్పకుండా... రెండోవారంలో ఏవో లెక్కలు చెప్పి... 81 ఏళ్ళ రికార్డ్ అంటూ ప్రచారం చేశారు. సినిమా బాగానే ఆడుతోంది. అయితే కలెక్షన్ల పరంపరను మరింత పెంచే దిశగా ఏ టీవీ ఛానల్‌లో చూసినా... గబ్బర్‌సింగ్ విశేషాలే వచ్చేట్లు చేశారు. రాకరాక వచ్చిన పవన్ సక్సెస్‌ను ఈ రకంగా పబ్లిసిటీ చేయడంలో నిర్మాత గణేష్‌బాబు సక్సెస్ అయ్యారు. అయితే.. దర్శక నిర్మాతలిద్దరూ చిరు కాంపౌండ్ వాళ్లే కనుక.... ఏ సినిమా రికార్డ్ అయినా మగధీరతో కంపేర్ చేసేవారు. కానీ ఈసారి మగధీర మాట లేకుండా దూకుడుతో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఇది నిజంగా దూకుడును క్రాస్ చేసిందా? లేదా? ఎంత? అనేవి త్వరలో తెలియనుంది.
Post a Comment