రీసెంట్ గా జర్నీ చిత్రంతో హిట్ కొట్టిన శర్వానంద్ మరో చిత్రం కమిటయ్యాడు. అయితే ఈ సారీ తమిళ దర్శకుడుతోనే సినిమా చేయనున్నాడు. తమమాయ్ తవమిరుందు, భారతి కన్నమ్మ, ఆటో గ్రాఫ్ వంటి ఎన్నో ఆవార్డు చిత్రాలు డైరక్ట్ చేసిన చేరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఓ విభన్నమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించటానికి చేరన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలం వరసగా హీరోగా సినిమాలు చేస్తూండటంతో చేరన్ డైరక్షన్ కి గ్యాప్ ఇచ్చారు. మళ్లీ విరామం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం.
ఇక నిత్యామీనన్ విషయానికి వస్తే నితిన్ కి చాలా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఇష్క్ లో ఆమె హీరోయిన్. దాంతో హీరోలందరూ ఆమెనే కోరుకుంటున్నారు. అయితే ఆమె మాత్రం దర్శకుడు,హీరో,కథ,తన పాత్ర వంటి అనేక అంశాలు పరిగణలోకి సినిమాలను ఒప్పుకుంటోంది. ఈ చిత్రంలోనూ నిత్యామీనన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. సినిమా లవ్ స్టోరీ కావటంతో యువతను టార్గెట్ చేస్తున్నారు. శర్వానంద్,నిత్యామీనన్ ని తీసుకోవటం ద్వారా ద్విభాషా చిత్రంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఎంగేయుమ్ ఎప్పోదుమ్ (జర్ని)చిత్రంతో హిట్‌కొట్టిన తెలుగు నటుడు శర్వానంద్‌ను చేరన్ తన చిత్రలో హీరోగా ఎంచుకోవటం తో చాలా ఆనందగా ఉన్నాడు. జర్ని తర్వాత ఆయన తెలుగులో అల్లరి నరేష్,శ్రియలతో చేసిన నువ్వా..నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఆయన సినిమా కమిటయ్యేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులోనూ చేరన్ వంటి దర్శకుడు,నిత్యామీనన్ వంటి హీరోయిన్ అనేసరికి మరో మాట లేకుండా ఓకే చేసేసారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చేరన్ యూనిట్ తెలిపింది.
ఇక ఈ చిత్రం తెలుగు రైట్స్ కి మంచి డిమాండ్ ఉండే అవకాసం ఉంది. అప్పుడే కొందరు డబ్బింగ్ నిర్మాతలు ఈ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రం కావటంతో యువతకు బాగా పడుతుందని,చేరన్ కి తెలుగులో సైతం మంచి పేరు ఉండటంతో ఇక్కడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దానికి తోడు నిత్యామీనన్ ఉందంటే డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్డిబిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. సినిమా ఎలా ఉన్నా ఓపినింగ్స్ కు లోటు ఉండదని,చిన్న సినిమాలకు ఓపినింగ్స్ బాగా మేలు చేస్తాయని చెప్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment