మెగా స్టార్ చిరంజీవి గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగును చెప్పి వినిపించారు. గబ్బర్ సింగ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆదివారం రాత్రి యాంకర్ సినిమాలోని ఓ డైలాగును పలువురి చేత కొట్టించారు. నాక్కొంచెం తిక్క, దానికో లెక్కుంది అంటూ చిరంజీవి డైలాగ్ చెప్పినప్పుడు అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఇదే డైలాగును నాగబాబు కాస్తా తిప్పేసి చెప్పారు. మాకు ముగ్గురికి కాస్తా తిక్క, దానికో లెక్కుంది అని ఆయన చెప్పారు.
చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కూడా విశ్లేషణ చేశారు. కొత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేశాడని, అయితే అవి అభిమానులు ఆశించినవి కావని, కానీ అవి చెడ్డ సినిమాలు మాత్రం కాదని ఆయన అన్నారు. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత అభిమానులు కొరుకున్నది చేయడమే ధర్మమని తాను అనుకుంటానని ఆయన అన్నారు. అలాగే మగధీరుడితో చరణ్‌కు ఓ ఇమేజ్ వచ్చిందని, అయితే కొత్తగా ఉండాలని లవర్ బాయ్‌గా తర్వాతి సినిమాలో నటించాడని, అది వర్కవుట్ కాలేదని ఆయన చెప్పారు.
ఆ తర్వాత రచ్చ వచ్చిందని, రచ్చను అభిమానులు ఆదరించారని ఆయన అన్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ కూడా డిఫరెంట్‌గా ఉండాలని కొన్ని సినిమాలు చేశాడని, ఇప్పుడు వస్తున్న గబ్బర్ సింగ్ అభిమానులు కోరుకున్న సినిమా అవుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా కెవ్వున కేక వేస్తుందని ఆయన అన్నారు. తానో పాట విన్నప్పుడు ఎగిరి డ్యాన్స్ చేయాలనిపించిందని, అయితే పెద్దమనిషిగా అలా చేయలేకపోయానని, కానీ తన ప్రమేయం లేకుండానే వేళ్లు ఆడుతూ వచ్చాయని ఆయన మెచ్చుకున్నారు.
కళ్యాణ్‌కు బండ్ల గణేష్ వంటి నిర్మాతలున్నారని, అయితే తనకు కూడా నిర్మాతలు ఉన్నారు గానీ కళ్యాణ్‌కు ఉన్నటువంటి నిర్మాతలు లేరని, నిర్మాతలు కళ్యాణ్ ఫ్యాన్స్ కావడం అదృష్టమని ఆయన అన్నారు. సినిమా దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌కు తాను అభిమానిని అని చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంటే స్కూల్ ఎగ్గొట్టి షూటింగ్ చూశానని, అప్పుడు పవన్ కళ్యాణ్ ఓసారి తనవైపు చూస్తే బాగుండనని ఆశపడేవాడినని, ఇప్పుడు ఆయనతో సినిమా తీశానని హరీష్ శంకర్ అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా పొగిడేశారు. జీవితాంతం తాను పవన్ కళ్యాణ్‌తో ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ తనను ఎలా ఆదరించిందీ ఆయన చెప్పుకొచ్చారు. తీన్‌మార్ ఆశించిన మేరకు ఆడకపోవడంతో గబ్బర్ సింగ్ సినిమాను తనకు ఇచ్చేశారని ఆయన అన్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment