వరసగా నాగార్జున సరసన చిత్రాలు చేసిన మమతా మోహన్ దాస్ ఈ మధ్య కాలంతో తెలుగు తెరకు దూరమైంది. దానికి తోడు..పెళ్లి కూడా చేసుకోవటంతో హీరోయిన్ గా ఆఫర్స్ అడిగేవాళ్లు లేక పోయారు. అయితే ఆ మధ్యన ఆమెకు ఓ పెద్ద ఆఫర్ వచ్చి తలుపు తట్టి ఆమె వెంటనే స్పందించకపోవటంతో వెనక్కి వెళ్లిపోయింది. ఆ సినిమా మరేదో కాదు దమ్ము. దమ్ములో ప్రస్తుతం కార్తీక చేస్తున్న పాత్రకు మమతామోహన్ దాస్ ని అడిగారు.
వివరాల్లో కి వెళితే..మొదట ‘దమ్ము’లో ఎన్టీఆర్ సరసన ఒక కేరక్టరును మమతకు ఆఫర్ చేశారు. అయితే 30-35 రోజుల వరకు ఆమె డేట్స్ ఇవ్వవలసి ఉంటుంది. చాలా మంచి కేరక్టర్ అని కూడా చెప్పారు. అయితే దాన్ని ఆమె రిజెక్టు చేసింది. దానికి కారణం.. ఆమె డేట్స్ పూర్తిగా రెండు, మూడు మలయాళ సినిమాలకు అప్పటికే ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా, అదే సమయంలో ఆమె ‘పెళ్లి’ కూడా ఫిక్స్ కావడంతో డైరీలో ‘దమ్ము’కు కావలసిన డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోయింది. ఆ రకంగా ఆమె వదులుకున్న ఆ పాత్రను ఇప్పుడు రాధ కుమార్తె కార్తీక చేశారు..దాంతో ఆ సినిమా బాగా వచ్చిందని తెలియటంతో ఆమె భాధపడుతున్నట్లు సమాచారం.
అయితే ఆమె మాత్రం బింకంగా...ఈ మధ్యకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నన్ను ఎగ్జయిట్ చేసిన సినిమా రాలేదు. అందుకే దూరం అవ్వాల్సి వచ్చింది అంటోంది మమతామోహన్ దాస్. కేడీ తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఆ విషయం చెప్తూ... వాస్తవానికి నేనిప్పటివరకు తెలుగులో దాదాపు పది సినిమాలు చేశాను. ఈ పది సినిమాల్లో గ్లామర్‌కన్నా నటనకే స్కోప్ లభించింది.ఇప్పుడు కూడా అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ గ్యాప్ తాత్కాలికం. మళ్లీ మంచి సినిమాకి ఆఫర్ వస్తే మరో మాట మాట్లాడకుండా అంగీకరించేస్తా అంది.
ఇక ఆమె తాజాగా ఓ తమిళ సినిమా చేస్తోంది. దాని పేరు 'తడైయర తాక్క". అరుణ్‌విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ దగ్గర సహాయ దర్శకుడిగా చేసిన మగిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. దమ్ము విషయానికి వస్తే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ అంతటా వినిపిస్తోంది. ఈ సినిమా మళ్లీ ఎన్టీఆర్ కి మరో సింహాద్రి తరహా సినిమా అవుతుందని చెప్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment