ఈమధ్య హీరోయిన్లు చేతిపైన బాడీపైన టాటూలు వేయించుకోవడం మామూలైంది. నయనతార మాత్రం ప్రేమకు గుర్తుగా ప్రభు అని టాటూ వేయించుకుని అప్పట్లో మీడియాకూ చూపించింది. ప్రస్తుతం ప్రభుదేవాతో రాంరాం.. చేసుకున్నాక.... తెలుగులో అవకాశాలు వచ్చిపడ్డాయి. గోపీచంద్‌తోనూ, బాలకృష్ణతోనూ నటిస్తోంది.
ఇటీవలే చేతిపై పూర్తి మేకప్ వేసుకుని టాటూ కన్పించకుండా గోపీచంద్ చిత్రానికి మేనేజ్ చేసింది. అయితే పూర్తిగా మానకపోవడంతో... గోపీచంద్ చిత్రం షెడ్యూల్ గ్యాప్ రావడంతో... బ్యాంకాక్ వెళ్ళి టాటూను తీయించుకుంటోందని వార్త ప్రచారం జరిగింది. దీనిపై నయనతార మండిపడింది. నేను బ్యాంకాక్ వెళ్ళలేదు.
ఇండియాలోనే లేజర్ చికిత్స ద్వారా టాటూనే తీసేసుకోవచ్చు. నా గురించి రాసినవాళ్ళు నాచేతిపై టాటూ ఉన్నదో లేదో చూసుకుని రాయండని హితవు పలికింది. ప్రస్తుతానికి టాటూ సినిమాకు ఇబ్బందిగా లేదనీ, జ్ఞాపకాలే లేనప్పుడు అది ఉన్నా లేకున్నా ఒక్కటేనని చెబుతోంది. ఇంతకీ అక్కడ ప్రభుదేవా టాటూ ఉన్నట్లా.. లేనట్లా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

Post a Comment