కేన్స్ చిత్రోత్సవాలకు బాలీవుడ్ అందగత్తె ఐశ్వర్యా రాయ్ హాజరు అవాతారా లేదా అనే అంశంపై రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే, బిగ్ బి ఫ్యామికి అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాల కథనాల మేరకు.. ఈ యేడాది ఆఖర్‌లో జరుగనున్న కేన్స్ చిత్రోత్సవాలకు ఐశ్వర్య రాయ్ తన ఆరు నెలల బిడ్డతో హాజరుకానుందని స్పష్టం చేశారు. ఈ చిత్రోత్సవాలకు అభిషేక్ బచ్చన్ హాజరవుతుందో లేదో చెప్పలేం. కానీ. తన ముద్దులు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య హాజరుకానుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రోత్సవాలను స్పాన్సర్ చేస్తున్న ఒక వాణిజ్య ఉత్పత్తి కంపెనీకి ఐశ్వర్యారాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో వరుసగా 11 సంవత్సరం ఈ ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవాలకు హాజరయ్యే ఐష్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలికేందుకు ఆ వాణిజ్య కంపెనీ సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ వాణిజ్య సంస్థ మీడియా అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు.

Post a Comment