దేశవ్యాప్తంగా మన్ననలందుకున్న అమీర్‌ఖాన్ సొంత ప్రొడక్షన్ సత్యమేవ జయతే టెలివిజన్ షో కాన్సెప్ట్ ప్రముఖ బాలీవుడ్ ఐటెం గరల్ రాఖీ సావంత్‌దా? తన కాన్సెప్ట్‌ను అమీర్ దొంగిలించి తన ప్రొడక్షన్‌లో నిర్మించుకున్నాడని ఈ అమ్మడు తెగ లొల్లి చేస్తోంది. రాఖీ తన పేరుపై నిర్మించిన రాఖీకా ఇన్‌సాఫ్‌కు అమీర్ సత్యమేవజయతే ఒక అనుకరణ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
గతంలో తాను నిర్వహించిన రాఖీ కా ఇన్సాఫ్ సమయంలో భాగంగా ప్రోగ్రామ్ వేదికపై ముచ్చటించిన కొందరు వ్యక్తుల అనుభవాలు, సమస్యలను విని తట్టుకోలేకపోయానని, ఆసుపత్రిపాలు కూడా అయ్యానని చెప్పుకొచ్చింది. దాంతోపాటు రాఖీ కా ఇన్సాఫ్‌లో పెద్దలకు మాత్రమే కంటెంట్ ఉందనే ప్రచారం జరగడం, తనలాంటి సెక్స్ బొమ్మ ఇమేజ్ ఉన్న తార ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పలు రకాల కామెంట్లొచ్చాయని దాంతో తన కార్యక్రమాన్ని రాత్రివేళ (పెద్దలు మేలుకుని ఉండే సమయం)కు మార్పు చేసారని తెలిపింది.
అయితే, మీ షోకు రాని క్రేజ్ గత వారం ప్రారంభమైన సత్యమేవజయతేకు మాత్రమే ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తే, అందుకు కారణం కేవలం అమీర్‌ఖాన్‌కున్న పేరు ప్రఖ్యాతులు మాత్రమే తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించింది. అమీర్‌కున్న పలుకుబడి వల్ల అతని కార్యక్రమం ఉదయం వేళ ప్రసారం అవుతుందని అందుకే మంచి టీఆర్పీ రేటింగులొచ్చాయంది.
అమీర్‌కున్న పలుకుబడి వల్ల అతని కార్యక్రమానికి సామాజిక ప్రయోజనం గల ప్రోగ్రామ్‌గా ప్రచారం చేసారని, అయితే ఆ కార్యక్రమం నిర్వహణకు అమీర్ రూ.3 కోట్లు తీసుకుంటున్నాడని, తన కార్యక్రమానికి మాత్రం వ్యాపారం రంగు అంటి అడ్డుకున్నారని వాపోయింది. రాఖీ కా సావంత్ కార్యక్రమం నిర్వహణకు తనకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చేవారని చెప్పింది.
నిజానికి, ఈ కార్యక్రమం కాన్సెప్ట్‌తో గతంలో కూడా చాలా టెలివిజన్లు ఎన్నో షోలు ఇచ్చాయంది. ఈ తరహా కార్యక్రమాల వల్ల దేశంలో పెనుమార్పులేవీ సంభవించవని, పైగా ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటాయని వ్యాఖ్యానించింది. అయితే అమీర్‌తో తనకెటువంటి వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేసింది. నిజానికి, అమీర్ ఒకప్పుడు తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనను ఎంతగానో ఆదుకున్నాడని, విశాలవాదం, దేశ సంక్షేమం కోరుకునే మానసిక ఎదుగుదల ఉన్న అమీర్ దేశ ప్రధాని కావాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉన్నాడంటూ ఆకాశానికెత్తేసింది. ఇవన్నీ విన్న జనాలు మాత్రం ఇంతకీ ఈ అమ్మడు అమీర్‌ను పొగుడుతుందా తిడుతోందా అని అర్థం కాక బుర్రలు గోక్కుంటున్నారు.

Post a Comment