రీసెంట్ గా ఓ బాలీవుడ్ టాప్ వెబ్ సైట్ బాలీవుడ్ సెలబ్రెటీల పర్శనల్ నెంబర్లను ప్రచురించింది. దాంతో ఆ వెబ్ సైట్ కు విపరీతమైన పేరు వచ్చింది కానీ..ఆ స్టార్స్ ని సమస్యల్లో పడేసింది. ముఖ్యంగా ఆ లిస్ట్ లో ఎక్కువ ఇబ్బంది పడుతోంది మలైకా అరోరా. ఆమె అక్కడ చేసిన దబాంగ్ సాంగ్ ఇప్పటికీ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ఆ పాటతో ఆమెకు విపరీతమైన ప్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో ఆ అభిమానులుకు ఇప్పుడీ నెంబర్ దొరకటం కోతికి కొబ్బరి కాయి దొరికినట్లయింది. వారంతా ఆమెకు ఫోన్ చేయటం ప్రారంబించారు. దాంతో ఆమె ఈ తలనొప్పి తట్టుకోలేక ఫోన్ నెంబర్ మార్చాల్సిన పరిస్దితి వచ్చింది. అప్పటికీ ఆ వెబ్ సైట్ వారిని హెచ్చరించి ఆ లిస్ట్ తీయించేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక మలైకా అరోరా రీసెంట్ గా పవన్ గబ్బర్ సింగ్ లోమున్ని పాటకు చేయటానికి కమిటైంది. అందుకుగానూ ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తోంది. ఇక ఆ ఫోన్ నెంబర్ల లిస్ట్ లో..స్మృతి ఇరాని,గుల్షన్ గ్రోవర్,షఫాలీ జరీవాల,వసూ భగ్నానీ,ప్రీతిష్ నంది,శ్యామ్ బెనగల్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఎవరో ఇండస్ట్రీ వ్యక్తులే కావాలని ఇలా చేసారని అంటున్నారు. ఇక వీరంతా కలిసి ఆ వెబ్ సైట్ పై చర్య తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
Post a Comment