మహేష్‌బాబు ఈ సినిమాని చూశారు. ఎంత బడ్జెట్‌లో తీశారు? అని అడుగుతూ... సినిమా బాగుందని చెప్పారు...ఆ సినిమా యూనిట్ సభ్యులకు వారు అభినందనలు తెలియజేయమన్నారు అన్నారు దిల్ రాజు. రీసెంట్ గా ఆయన ‘ఈ రోజుల్లో’చిత్రం రైట్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం నిర్మిస్తున్నాను. లొకేషన్‌లో ఈ రోజుల్లో చిత్రం గురించి ప్రస్తావన వచ్చింది. వెంకటేష్ కూడా ఈ సినిమా బాగుందన్నారు. ఈ సినిమాలో స్టార్స్ లేరు. కానీ మంచి కథ ఉంది. అందుకే ప్రేక్షకాదరణ పొందింది.. నూతన నటీనటులతో తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తీయడం నన్ను ఇన్‌స్పయిర్ చేసింది. ఇలాంటి మంచి సినిమాని మరింతగా ప్రేక్షకులకు దగ్గర చేయాలనే ఆలోచనతో నా వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చాను అని ‘దిల్’రాజు చెప్పారు.
గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై మారుతి దర్శకత్వంలో శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘ఈ రోజుల్లో’. మొన్న ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. మారుతి మాట్లాడుతూ...కథ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేశాను. ఎ సెంటర్‌తో పాటు బీ,సీల్లో కూడా ఈ సినిమా ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. విడుదలకు ముందు తమ్మారెడ్డి భరద్వాజ్ హెల్ప్ చేశారు. ఇప్పుడు ‘దిల్’రాజు ముందుకు రావడం ఆనందంగా ఉంది అని అన్నారు. అల్లు అరవింద్ నా గాడ్‌ఫాదర్ అయితే ‘దిల్’రాజు గాడ్‌బ్రదర్‌లాంటివారని ఎస్.కె.ఎన్. చెప్పారు. ఇంకా శ్రీ, రేష్మా, సాయి ఈ చిత్రవిజయంపట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు.
Post a Comment