పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన గత మూడు సినిమాలు తీసుకుంటే పులి, పంజా పరమ ప్లాపులుగా మిగలగా, తీన్‌మార్ చిత్రం ఫర్వాలేదినిపించింది. ఈ సినిమాలు ప్లాపవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే వినోదం ఆ చిత్రాల్లో లభించక పోవడమే. ప్రతి హీరో తొలి నుంచి ప్రేక్షకులకు నచ్చే విధంగా తన కంటూ ప్రత్యేకమైన మేనరిజాన్ని అలవాటు చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ కూడా తొలి నుంచి తన దైన ప్రత్యేకమైన స్టయిల్‌ను మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు. బద్రి, తమ్ముడు, ఖుషీ, జల్సా చిత్రాలు విజయవంతం కావడానికి పవన్ స్టయిల్ కూడా ఓ కారణం. అయితే పులి, పంజా చిత్రాల్లో మనం కోరుకునే పవన్ కళ్యాణ్‌ని మిస్సయ్యామనే చెప్పాలి.
ఈ పరిణామాలన్నీ విశ్లేషించిన దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో....బాగా స్టీడీ చేసి ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లు, ఆ వాటిలోని డైలాగులనుబట్టి చూస్తే ఇది స్పష్టం అవుతోంది. హిందీ దబాంగ్ సినిమా సబ్జెక్టు కూడా పవన్ కళ్యాన్‌కు తగిన విధంగా ఉండటం కూడా ఓ ప్లస్ పాయింట్. దేవిశ్రీ లాంటి మాస్ బీట్లు వేసే మ్యూజిక్ డైరెక్టర్ తోడైతే ఆ సినిమా ఆ సినిమా ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం తప్పకుండా పవన్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచేలా ఉంటుందనేది దర్శక నిర్మాతల నుంచి వినిపిస్తున్నవాదన.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీ భట్ల తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.
Post a Comment