Home »
FEATURE
» 'దమ్ము' కోసం 9 కథలను రిజెక్ట్ చేశా.. 'ఆడియో'లో ఎన్టీఆర్
'దమ్ము' కోసం 9 కథలను రిజెక్ట్ చేశా.. 'ఆడియో'లో ఎన్టీఆర్
అభిమానులకు దమ్మున్న కథను అందించాలన్న తపనతో బోయపాటి శ్రీను చెప్పిన 9 కథలను రిజెక్ట్ చేశానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. హైదరాబాదులో అభిమానుల కోలాహలం మధ్య దమ్ము ఆడియో విడుదల కార్యక్రమం గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... బోయపాటి శ్రీను మొదట్లో భద్ర సినిమా చెప్పేందుకు తన వద్దకు వచ్చాడన్నారు. ఆ కథ చెప్పిన విధానాన్ని చూసి బెదిరిపోయాననీ, అప్పట్లో ఆ కథ నచ్చక వదిలేశానన్నారు. అయితే బాబాయ్ సింహా చిత్రం చూశాక అయ్యబాబోయ్ సినిమా ఇలాక్కూడా తీస్తారా అనిపించింది. అప్పుడు చెప్పాను ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారికి.. బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నామని. నిజానికి ఇదేమీ ఆయన విజయవంతమైన దర్శకుడని కాదనీ, ఆయన దర్శకత్వంలో అవకాశం రావడం తన అదృష్టమన్నారు. దమ్ము చిత్రం నూటికి నూరుపాళ్లు దమ్మున్న చిత్రమనీ, ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లకు వెళ్లి చూడండని జూనియర్ ఎన్టీఆర్ కోరారు.
Post a Comment