హీరోయిన్ అనుష్క, రాజామౌళి భార్య రమావత్సలపై దాఖలైన భూవివాదం కేసు ఏప్రిల్ 16కు వాయిదా పడింది. రెండేళ్ల క్రితం మధురవాడ గ్రామంలో 300 చదరపు గజాల స్థలాన్ని నటి అనుష్క, దర్శకుడు రాజమౌళి భార్య రమావత్సలతో పాటు మరో ఐదుగురు కొనుగోలు చేశారు. అయితే సంబంధిత భూమి అమెరికాకు చెందిన కె. లింగమూర్తిది కాగా, వేరే వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని అమ్మగా వీరు కొనుగోలు చేశారు.
దీంతో అసలు యజమాని అయిన లింగమూర్తి 2010 అక్టోబర్లో భీమునిపట్నం కోర్టులో అనుష్క, రమా రాజమౌళి, మిగిలిన ఐదుగురిపై కేసు వేశారు. ఈ మేరకు వారంతా కోర్టుకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేయగా..తగిన ఆధారాలతో హాజరయ్యేందుకు తమకు గడువు కావాలని అనుష్క, రమ రాజమౌళి తదితరులు హైకోర్టు నుంచి స్టే పొందారు. తమకు స్టే ఉన్నందున ఈ కేసును వాయిదా వేయాలని అనుష్క తరుపు న్యాయవాది కోరగా...కేసును ఏర్పిల్ 16కు వాయిదా వేశారు. భూమి కొనుగోలు విషయంలో దర్శకుడు రాజమౌళి, రవితేజ ప్రమేయం కూడా ఉందనే వార్తలు వినిపించాయి.
Post a Comment