మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు షర్ట్ లెస్ గా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే అది నిజమా కాదా అన్నది ఎవరూ కన్పర్మ్ చేయకపోయినా ఆయన ఫిజికల్ ట్రైనర్ తో కలిసి దిగిన ఫోటో అంటూ ఒకటి నెట్ లో ప్రచారమవుతోంది. మైక్ రేయాన్ అనే హాలీవుడ్ ట్రైనర్ ని రప్పించి ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇంటర్నేషనల్ ట్రైనర్ సమక్షంలో సిక్స్ ప్యాక్ బాడీ బిల్ట్ చేసుకోవటం బెస్ట్ అనే ఆలోచనతో ఈ ట్రైనర్ ని తెచ్చుకున్నట్లు చెప్తున్నారు. మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉందని చెప్తున్నారు. లోకల్ ట్రైనర్ల దగ్గర సిక్స్ బాడీ ట్రైనింగ్ తీసుకుంటే ఫేస్ లో గ్లో పోతుందని, హాలీవుడ్ ట్రైనర్ అయితే ఫేస్ లో గ్లామర్ పోకుండా పర్ ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తాడని ఆయన ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు. అన్నట్లు మెక్ రేయన్ రేటు బాగా ఎక్కువని, నాలుగు నెలల శిక్షణ కాలానికి రూ. 1 కోటి వరకు ఫీజు తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.
గతంలో ఇదే విషయమై మీడియా వారు మహేష్ ని అడగటం జరిగింది. అప్పుడు మహేష్ మాట్లాడుతూ...సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నించాను. ముఖం అదోలా తయారైంది. ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టేశాను. ఫ్యూచర్‌లో ట్రై చేస్తానేమో అన్నారు మహేష్ బాబు. అదే ఇప్పుడు జరగుతోందని,సుకుమార్ సినిమాలో కొత్తగా కనిపించటానికి మహేష్ ప్రయత్నిస్తున్నాడని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ ధ్రిల్లర్ అనే ప్రచారం జరుగుతోంది.
సుకుమార్,మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాట నిమిత్తం రెండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫి అందిస్తున్నాడు. టాలీవుడ్ లో ఇదే హైయిస్ట్ ఖర్చు పెట్టి తీస్తున్న పాట అని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత గోపీచంద్ ఆచంట సైతం ఖరారు చేస్తున్నారు.
గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ...నేను ఎంత ఖర్చైంది అని చెప్పను కానీ..ఈ పాట మీద మాత్రం చాలా ఖర్చు పెడుతున్నాం. మొత్తం తెరమీద కనపడుతుంది. మేం తీసిన దూకుడు కన్నా లావిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఇక ఈ పాట కోసం 500 మంది టాప్ మోడల్స్ ని ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. ఇది చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అలాగే భారీ సెట్ సైతం వేసారు. మోడల్స్ కి ప్రత్యేకమైన డ్రస్ లు కుట్టించారు. చూసిన వాళ్లు కళ్లు తిప్పుకోలని విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment