అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్.రాధాకృష్ణ నిర్మాతగా ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'జులాయి'. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. జూన్ మొదటి వారంలో దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ సందర్భంగా ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న జులాయి ఇటీవలే దుబాయ్‌లో న్యూ లొకేషన్స్‌లో రెండు పాటల చిత్రీకరణ చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇలియానా హీరోయిన్‌గా చేస్తుంది. అల్లు అర్జున్, ఇలియానా జోడీ ఆన్ స్క్రీన్‌పై అలరిస్తుందన్నారు.
వీరి జంట చూడముచ్చటగా ఉండబోతుందని చెప్పారు. చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా రొమాంటిక్‌గా ఉంటుందని చెప్పారు. అంత అద్భుతంగా మా దర్శకుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దాడన్నారు. అలాగే సంభాషణ విషయంలో చేయి తిరిగిన త్రివిక్రమ్ మరొక్కసారి అలరిస్తారు. అర్జున్ ఎనర్జీకి తగ్గ చిత్రం. అంతేకాదు థియేటర్స్‌లో విజిల్స్ పడేలా డైలాగ్స్ రాశారని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. హీరో హీరోయిన్ల తర్వాత అంతే ఇంపార్టెంట్ ఉంటుందని, కీలకమైన పాత్రలో డా.రాజేంద్రప్రసాద్ నటించినట్టు చెప్పారు. జులాయి చిత్రానికి మరో హైలైట్‌గా ఆయన నటన ఉంటుందనేది ఏమాత్రం సందేహం లేదు. ఇటీవల ఆడియోలో కెవ్వుకేక పుట్టిస్తున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చినట్టు చెప్పారు.
బన్నీ, దేవీశ్రీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆడియోను జూన్ మొదటి వారంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పూర్తి వినోదంతో పాటు అన్ని షడ్రుచులు కలిపి జూన్‌లోనే మీముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment