మణిరత్నం తాజా చిత్రంలో నయనతారని తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆమెకు ప్రస్తుతం తాను డైరక్ట్ చేస్తున్న కడల్ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను ఆఫర్ చేసారని, ఆమె వెంటనే ఓకే చేసిందని చెప్తున్నారు. స్క్రిప్టు, తన పాత్ర ఏమిటి అని అడగకుండా మరీ మణిరత్నం చిత్రాన్ని ఆమె ఒప్పుకుందని చెన్నై వర్గాలు చెప్తున్నారు. నయనతారకు ఎప్పటినుంచో మణిరత్నం దర్శకత్వంలో చేయాలనే కోరిక అని.. అది ఈ విధంగా తీరనుందని ఆమె శ్రేయాభిలాషులు అంటున్నారు.
రీసెంట్ గా ఈ చిత్రంనుంచి సమంతను తొలిగించిన సంగతి తెలిసిందే. ఆమెపై కొన్ని కీ సీన్స్ షూట్ చేసాక ఆమెను చిత్రం నుంచి తొలిగించారు. హీరో కన్నా ఆమె పెద్దదిగా కనిపిస్తోందనే ఉద్దేశంతో ఆమెకు బై చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోగా కార్తీక్ కుమారుడు గౌతమ్ పరిచయం అవుతున్నాడు. అలాగే రాధ రెండో కుమార్తె(కార్తిక చెల్లెలు)తులసి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక ఆ చిత్రం టైటిల్ పేరు ‘కడల్'.
అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. కార్తీక్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది. ‘కడలి' టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment