రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్'రీమేక్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒక కొత్త హీరో ప్రక్కన అదీ లాంచింగ్ సినిమాలో చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి అసలు కారణం ప్రియాంక చోప్రా రీసెంట్ గా రివీల్ చేసింది. అది మరేదో కాదు..తనకు అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన ఇష్టం అని..ఆయన సినిమాలు ఏది రీమేక్ చేసినా తానే హీరోయిన్ గా చేస్తానని ప్రకటించింది.
ఆమె మాటల్లోనే... ''అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన 'డాన్', 'అగ్నిపథ్' చిత్రాల్ని రీమేక్ చేస్తే అందులో నేనే హీరోయిన్ నటించాను. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా అపూర్వ లఖియా 'జంజీర్' సినిమాను రీమేక్ చేస్తున్నారన్నా అందుకే ఆసక్తి చూపించాను. సెప్టెంబరు నుంచి చిత్రీకరణలో పాల్గొంటాను. ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చింది.
అలాగే భవిష్యత్తులో బిగ్ బీ నటించిన మరే చిత్రాన్ని రీమేక్ చేసినా అందులో నేను హీరోయిన్ గా నటించేందుకు ముందుంటాను'' అని చెప్పింది. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్ కపూర్ సరసన ఆమె నటించిన 'బర్ఫి' సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఇందులో ఆమె మానసిక పరిపక్వత లేని యువతిగా కనిపించబోతోంది. ఈ పాత్ర తనకు మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment