త్రిష తాగుతుందో లేదో కానీ త్రాగుడు మ్యాటర్ లో వేలు పెట్టడం వల్లే ఆమె ఉలిక్కిపడినట్లైంది అంటోంది తమిళ మీడియా. రీసెంట్ గా మరో హీరోయిన్ సనాఖాన్..సౌత్ హీరోయిన్స్ త్రాగుతారు, సిగెరెట్స్ కాలుస్తారు అని కామెంట్ చేస్తే ఎక్కువ రెస్పాండ్ అయ్యింది త్రిష మాత్రమే. ఆమె ఈ విషయమై తమిళ నటీనటుల సంఘానికి సనాఖాన్‌పై తగిన చర్య తీసుకోమని త్రిష ఫిర్యాదు చేశారని వినికిడి.
కళ్యాణ్ రామ్ తో కత్తి,మంచు మనోజ్ తో మిస్టర్ నోకియా సినిమాల్లో చేసిన సనాఖాన్ ఆ మధ్యన మీడియాతో హీరోయిన్స్ త్రాగుడు మ్యాటర్ పై నోరు జారింది. ఆమె మాట్లాడుతూ..‘‘ఉత్తరాది హీరోయిన్స్ మందు పుచ్చుకుంటారని, సిగరెట్లు కాల్చుతున్నారని నిందిస్తారు. కానీ దక్షిణాది తారల్లో కొంతమంది ఈ రెండు వ్యవహారాలను జోరుగా సాగించడం నేను చూశాను. అసలు నార్త్ హీరోయిన్స్‌కన్నా సౌత్ హీరోయిన్స్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. కానీ వారి కార్యకలాపాలు బయటికి రావడంలేదు'' అని సనాఖాన్ కామెంట్ చేసింది.
దాంతో ఆమెపై సౌత్ హీరోయిన్స్ లో ఓ వర్గం మండిపడుతోంది. కొందరు హీరోయిన్స్ అయితే సనాకి ఫోన్ చేసి, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిక జారీ చేశారని సమాచారం. మరికొంతమంది హీరోయిన్స్ ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో సనాఖాన్‌ని హెచ్చరించారట. వారిలో అందరికన్నా త్రిష ఇలా ఓ అడుగు ముందుకేసి కంప్లైంట్ ఇచ్చిందని తెలుస్తోంది.
ఇంతకు ముందు సనాఖాన్ ఇలా మరో వార్తతో వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం వ్యభిచారం చేస్తూ సనాఖాన్ పట్టుబడింది అనే వార్త రాగానే.. అది చాలామంది హీరోయిన్ సనాఖానే అని భావించారు. దాంతో తనకే పాపం తెలియదని, ఆ సనాఖాన్ వేరే యువతి అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఏ మాత్రం సంబంధం లేని విషయానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినందుకు ఆమె చింతించారు. ఇప్పుడు కూడా సనా మరో సారి ఇలా ఇరుక్కున్నారు
Share with Friends : |
Share with Friends : |
Post a Comment