ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈగ' చిత్రం ఫస్ట్ కాపీని బుధవారం రాత్రి ప్రదర్శించారు. ఈ షోను రాజమౌళితో పాటు ఈగ చిత్రం సమర్పకుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు, తమిళ వెర్షన్ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి, మరికొందరు కలిసి వీక్షించారు. ఈ చిత్రం చూసిన తర్వాత సురేష్ బాబు చాలా థ్రిల్ ఫీలయ్యారని, నన్ను కౌగిలించుకని చాలా సంతోషంగా ఫీలయ్యారని, ఈచిత్ర నిర్మాణంలో భాగం అయినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఆయన చెప్పారని... రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించారు.
ఈగ మూవీ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ గా రూపొందిన ఈ మూవీ జులై 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘ఈగ' చిత్రం విడుదలకు ముందు స్టోరీ మొత్తం చెప్పేసిన దర్శకుడు రాజమౌళి....తన డైరెక్షన్ సత్తాను చాటుకున్నాడు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన సురేష్ బాబు ఆనందం చూస్తుంటే రాజమౌళి ఈగ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టిస్తుందని జోష్యం చెప్పారు.
‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ‘
Share with Friends : |
Share with Friends : |
Post a Comment