చిరంజీవితో పాటు తెలుగు అగ్రహీరోలందరి సరసన ఒకప్పుడు ఓ ఊపు ఊపిన హీరోయిన్ మీనా.....ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమా కోసం మీనాను సంప్రదించారు దర్శక నిర్మాతలు. చెర్రీకి అత్తమ్మ పాత్రలో చేయాలని అడిగ్గా...నా వల్ల కాదని చెప్పేసిందట మీనా.
ప్రస్తుతం తాను సినిమాలను పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నానని. మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టి ఇటు ఇంటినీ అటు సినిమాలను బ్యాలన్స్ చేయలేనని స్పష్టం చేసిందట. చిరంజీవి సరసన చాలా సినిమాల్లో నటించింది కాబట్టి మీనా అయితే బాగా కుదురుతుందని భావించిన నిర్మాతలను మీనా ఇలా డిసప్పాయింట్ చేసింది.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే... వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్, అమలపాల్ నటిస్తున్నారు. ఈచిత్రానికి రామ్ చరణ్ ముద్దు పేరు ‘చెర్రీ'ని టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యూనివేర్సల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
‘చెర్రీ' చిత్రానికి ఆకుల శివ కథ అందించారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, సుధా రాహుల్ దేవ్, రఘుబాబు, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మెగా అభిమానులు కోరుకునే మాస్ మసాలా అంశాలతో ఈచిత్రం రూపొందుతోంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment