హీరో సూర్య, సినీయర్ నటుడు మోహన్ బాబు ప్రత్యర్థులుగా మార బోతున్నారు. మోహన్ బాబు రావణాసురుడి పాత్రలో ‘రావణ’ అనే చిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో సూర్య నటించబోతున్నట్లు సమాచారం.
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారీ పౌరాణిక చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థపై ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖ నటులు నటిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
హీరో విక్రమ్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, శ్రియ....ఇతర నటీనటులు ఇందులో నటిస్తారని ప్రాచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బెల్లడి కానున్నాయి.
ఈ చిత్రం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.....రావణ చిత్రం కోసం తాము ఇప్పటి వరకు ఎవరినీ సంప్రదించ లేదని....శ్రీదేవిని, శ్రియను సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ చిత్రాన్ని విష్ణు ప్రొడ్యూష్ చేస్తున్నాడు. త్వరలోనే ఈచిత్రం నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియజేస్తాం అన్నారు.
ఈ సినిమాలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి పెద్ద పీట వేయనున్నట్టు మోహన్ బాబు చెప్పారు. గతంలోఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానుభావులు రావణాసురుడి పాత్రను పోషించి మెప్పించారనీ ... తనదైన శైలిలో ఈ పాత్రను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అధునాతనమైన 3 డి పరిజ్ఞానంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో, భారతీయ సినీపరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా నటిస్తారని చెప్పారు.

Post a Comment