పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా సరైన హిట్ లేని పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ద్వారా తన సత్తా ఏమిటో చాటాలని ఉవ్విల్లూరుతున్నాడు.
ఈ సీజన్లో ఇప్పటికే విడుదలై రామ్ చరణ్ ‘రచ్చ’, జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. ఇప్పటికే రచ్చ చిత్రం నాలుగు వారాలు పూర్తి చేసుకుని రూ. 50 కోట్లు క్రాస్ అవ్వగా, దమ్ము చిత్రం వారం రోజుల్లో దాదాపు 30 కోట్లు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని కూడా భారీ ఎత్తున విడుదల చేసి రికార్డులు సృష్టించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే రచ్చ, దమ్ము చిత్రాల మాదిరి పోటీ ఫ్రీ వాతావరణం గబ్బర్ సింగ్‌కు లేదు. గబ్బర్ సింగ్‌కు పోటీ ఇవ్వడానికి దరువు వేస్తూ వస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. గబ్బర్ సింగ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా... రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆచిత్రం కలెక్షన్లకు ఎంతో కొంత గండి పడే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ‘గబ్బర్ సింగ్’ కలెక్షన్ల పరంగా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.

Post a Comment