పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రేపు భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ చిత్రం దబంగ్ కి రీమేక్ కావటంతో రెండింటి మధ్యా పోలీకలు వస్తాయని భావిస్తున్నారు. అయితే దబాంగ్ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ పూర్తిగా మార్పులు చేసి తెరకెక్కించాడని తెలుస్తోంది. దాదాపు నలభై శాతం కథ మారిపోయిందని, తమ్ముడు గా చేసే అజయ్ పూర్తిని సైతం పూర్తిగా నెగిటివ్ గా మార్చాడని వినపడుతోంది. అలాగే విలన్ పాత్రను పెంచి కథలో ప్రారంభం నుంచీ వచ్చి,హీరోకు సవాల్ విసిరేలా చేసాడని చెప్తున్నారు.
దబాంగ్ లో విలన్ పాత్ర సెకండాఫ్ సగంలో వచ్చి క్లైమాక్స్ కు వెళుతుంది. అయితే గబ్బర్ సింగ్ లో మొదటి నుంచి విలన్ పాత్ర పూర్తిగా కథలో ఏక్టివ్ గా ఉండేటట్లు చేసారని చెప్తున్నారు. అలాగే పవన్ పాత్ర లో మరింత వెటకారం జోడించారని,హీరోయిన్ పాత్రను సైతం మార్చారని చెప్తున్నారు. హీరోయిన్ పాత్ర దబాంగ్ లో కుండలు అమ్మే పాత్ర అయితే ఇక్కడ తెలుగులో దాన్ని పూలు అమ్మే అమ్మాయిగా మార్చారని, అలా ప్రతీ పాత్రకూ ఎక్సటెంపోలు ఇస్తూ మార్చుకుంటూ పోయాడని అంటున్నారు.
ఇక ఇలా స్క్రిప్టులో పూర్తిగ మార్పులు చేయటానకి కారణం ..తమిళంలో ఈ చిత్రం డిజాస్టర్ కావటం. తమిళంలో సింబులో ఓస్తి పేరట దబాంగ్ ని రీమేక్ చేసారు. అక్కడ ..దబాంగ్ ని ఏమాత్రం మార్చకుండా తెరకెక్కించారు. అక్కడ వారికి అది కిక్ ఇవ్వలేదు. సెంటిమెంట్ కన్నా యాక్షన్ ని ఎక్కువ ఉంటే బాగుండేదని అంతా అభిప్రాయపడ్డారు. హీరో పోలీస్ అధికారి అనగానే యాక్షన్ సినిమా అంటు ధియోటర్ కి వచ్చిన వారికి ఓస్తి నిరాశ పరిచింది. దాంతో అది దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసాడంటున్నారు.
అలాగే దబాంగ్ లో లేని కామెడీ ని ఈ చిత్రంలో కలిపారని,తెలుగు నేటివిటికి తగినట్లుగా ఆ కామెడీని చాలా హైలెట్ గా చేసారని,అలీ బ్రహ్మానందం వంటి వారు ఈ కామెడీ సీన్స్ ని బాగా పండించారని అంటున్నారు. శృతి హాసన్ పాత్ర సైతం గబ్బర్ సింగ్ లో మరికాస్త మెచ్యూరిటీతో కథలో భాగంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఐటం సాంగ్ సైతం కొత్తది కెవ్వు కేక అని చేయటం,అది సూపర్ హిట్ అవటం, ఈ సినిమాపై అంచనాలు బాగా పెంచుతున్నాయి.
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.

Post a Comment