డాన్స్ స్టెప్స్ విషయంలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అసౌకర్యానికి గురయ్యారని చెన్నై సమాచారం. డాన్స్ డైరక్టర్ సరోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ‘కోచడయాన్’ కోసం ఓ పాట చిత్రీకరణ జరిగింది. ఆమె సమకూర్చినవాటిలో కొన్ని ‘హాట్ మూమెంట్స్’ ఉన్నాయి. అవి చాలా అసౌకర్యవంతంగా ఉన్నాయని తన కుమార్తె సౌందర్య, సరోజ్‌ఖాన్‌లతో అన్నారట రజనీ. కొంచెం డోస్ తగ్గిస్తే బాగుంటుందని కోరారట. రజనీ కోరిక మేరకు స్టెప్స్‌ని మార్చారని తెలిసింది.
రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న‘కోచడయాన్’ చిత్రం షూటింగ్ లండన్‌లో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవల కేరళలో రజనీ, దీపికా పాల్గొనగా ఒక పాటను చిత్రీకరించారు. తమ మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని దీపికాతో ఈ పాటకు సంబంధించిన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి రజనీకాంత్ ఇబ్బందిపడ్డారు. క్లాసికల్ డాన్స్ నేపథ్యంలో సాగే ఈ పాటకు ఎ.ఆర్. రహమాన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని రజనీ మెచ్చుకున్నారని సమాచారం.
ప్రస్తుతం బాలీవుడ్‌లో హవా సాగిస్తున్న దీపికాకు ఇప్పటివరకు ఎన్నో దక్షిణాది అవకాశాలు వచ్చినా ఆమె పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. చివరికి రజనీ కాబట్టి ‘కోచడయాన్’ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించారు. రజనీ వయస్సు 62,ఆమె వయస్సు 26 అయినా రజనీనే యంగ్ గా అదరకొడుతున్నాడని యూనిట్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్' ఒక విందులాంటిదని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. రజనీకాంత్, శరత్‌కుమార్, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'రోబో' తర్వాత రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్. శరత్‌కుమార్, జాకీష్రాఫ్, శోభన, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్రీడీలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 'అవతార్' తరహా టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. రజనీకాంత్‌తోపాటు శోభన, నాజర్‌లు 'యానిమేషన్ కాస్ట్యూమ్స్'లో నటిస్తున్న ఫొటోలు చిత్రవర్గాలు ఇటీవల విడుదల చేశాయి.
సినిమా గురించి దర్శకురాలు మీడియాతో మాట్లాడుతూ.. ''కోచ్చడయాన్' సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో నటించడం అంత సులభం కాదు. సవాల్‌తో కూడుకున్న విషయం. ఊహకే అంతుచిక్కని లొకేషన్లు ఇందులో కనిపించడం విశేషం. ఇదో ఫాంటసీ సినిమా. కేవలం పిల్లల్నే గాక అందర్నీ ఈ సినిమా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదలవుతుంది''అని తెలిపారు. 'కోచ్చడయాన్' తెలుగు హక్కుల్ని లక్ష్మీగణపతి ఫిలిమ్స్ దక్కించుకొంది.

Post a Comment