పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రేపు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమా టాక్ కూడా బయటకు వచ్చింది. పైగా ఈ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్ కాబట్టి సినిమా ఎలా ఉంటుంతో ఇట్టే ఊహించొచ్చు.
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
యూనిట్ సభ్యుల నుంచి అందిన వివరాలు, సెన్సార్ పూర్తయిన అనంతరం వినిపిస్తున్న టాక్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి....
దర్శకుడు హరీష్ శంకర్ ‘దబాంగ్’ చిత్రాన్ని మక్కికి మక్కి కాపీ కొట్టకుండా దాదాపు 40% సినిమాను ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ సందర్భంగా రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ సూపర్ గా చిత్రీకరించారు. అనంతరం రాజస్థాన్లో చిత్రీకరించిన గబ్బర్ సింగ్ సాంగులో ఆర్మీమెన్స్, గన్స్ తో అదరగొట్టారు. ఇక్కడే పవర్ స్టార్ గుర్రపు స్వారీ సీన్ కనిపించనుంది.
అదే విధంగా ఈచిత్రంలో దర్శకుడు 7 నిమిషాల నిడివిగల ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా ప్లాన్ చేశాడు. ఇందులో తల్లి కొడుకుల అనుబంధాన్ని చూపించారట. ఇక చిత్రంలో శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలోఅద్భుతంగా కనిపించనుంది. కోట శ్రీనివాస తాగుబోతు పాత్రలోతన దైన శైలిలో నటించాడు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే...
సినిమా మొత్తం సిఎంవైకె మోడ్‌లో చిత్రీకరించారు. గతంలో యమదొంగ, మగధీర చిత్రాలు ఈమోడ్‌లో చిత్రీకరించారు. దీని వల్ల సినిమా విజువల్‌గా మంచి అనుభూతిని ఇస్తుంది. సినిమా తొలి భాగం గంట డ్యూరేషన్లో చిత్రీకరించారు. బోరింగ్ అనేది అస్సలు ఉండదు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉండబోతోంది. ఇంటర్వెల్ సమయంలో రైల్వే స్టేషన్ వద్ద ఓ ఫైట్ సీన్ పెట్టారు. సెకండాఫ్ విషయానికొస్తే...ఎమోషనల్ సీన్లతో కథ స్లో అయినట్లుంటుందని తెలుస్తోంది. స్టోరీ డెప్తుగా ఉండటంతో కాస్త బోరింగ్ అనిపించనున్నట్లు సమాచారం.
సినిమాలో పవన్, శృతి హాసన్ పెళ్లి తర్వాత చిత్రీకరించిన దిల్ సే సాంగు రొమాంటిక్‌గా, కలర్ పుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ బ్రదర్ పాత్రలో అజయ్ బాగా నటించాడట. అజయ్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్‌గా ఈ పాత్ర నిలుస్తుంది. అజయ్‌కి జంటగా గాయత్రి(హాపీడేస్ ఫేం అప్పు) నటించింది.
కెవ్వు కేక సాంగు తొలి సగం ప్రేక్షకులను ఎమంతగా ఆకట్టుకోదని, పవన్ ఎంట్రీ ఇచ్చిన సూపర్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్లోమోషన్లో వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఇక క్లయిమాక్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కెరీర్లో వచ్చిన చిత్రాల్లోకెల్లా బెస్ట్ క్లైమాక్స్‌గా నిలుస్తుందని అంటున్నారు.
ప్లస్ పాయింట్స్...
హరీష్ శంకర్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుటుంది.
పవర్ స్టార్ యాక్షన్ పరంగా, ఎంటర్ టైన్మెంట్ పరంగా అలరించడం ఖాయం
శృతి హాసన్ అందం, అభినయం బాగుంటుంది
దబాంగ్ చిత్రంలో సోనూసూద్ కంటే అభిమన్యు సింగ్ చాలా బాగా చేశాడు. గబ్బర్ సింగ్ చిత్రానికి అతని పాత్ర కూడా ప్లస్సవుతుంది.
నెగెటివ్ పాయింట్స్...
ఫస్టాఫ్ రేంజిలో సెకండాఫ్ ఉండక పోవడం అంటున్నారు
సెంటిమెంట సీన్లు సరిగా పడలేదనే టాక్ వినిపిస్తోంది
ఫైనల్ గా....
ఈ చిత్రం సమ్మర్ విన్నర్ అవ్వడం ఖాయం అని స్పష్టం అవుతోంది. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా అలరిస్తుంది. పవర్ స్టార్ నుంచి సరైన హిట్టు చూడక 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి గబ్బర్ సింగ్ చిత్రంతో తీరడం ఖాయంగా కనిపిస్తోంది.

Post a Comment