12ఏళ్ల క్రితం ఎమ్మెస్‌రాజు సినిమాలను పంపిణీ చేస్తే చాలు అనుకునేవాడ్ని. నా ‘దిల్’ నిర్మాణంలో ఉన్నప్పుడు ‘ఒక్కడు’ సినిమా చూసి, ‘తీస్తే ఇలాంటి సినిమా తీయాలి’ అనుకున్నాను అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అలాగే తనకు నిర్మాతగా నాకు ఎమ్.ఎస్ రాజు ఆదర్శం. మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల్లా ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. వెంకటేష్, అల్లు అర్జున్‌ల మాదిరిగా నిర్మాత కొడుకైన అశ్విన్ నిర్మాతల హీరో అని పించుకోవాలి అని చెప్పుకొచ్చారు.
నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘తూనీగ తూనీగ’. ఎమ్మెస్‌రాజు ఈ చిత్రానికి దర్శకుడు. మాగంటి రామ్‌చంద్రన్(రామ్‌గీ) నిర్మాత. దిల్ రాజు సమర్పకుడు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో డి.రామానాయుడు చేతులమీదుగా జరిగింది. సుమంత్ అశ్విన్ స్క్రీన్‌లుక్‌ని వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ పంక్షన్ లో ఆయన ఇలా స్పందించారు.
అలాగే రామానాయుడు మాట్లాడుతూ ...పరిశ్రమలోని మంచి నిర్మాతల్లో ఎమ్మెస్‌రాజు ఒకరు. కథ సంతృప్తినిస్తేగానీ సినిమా మొదలుపెట్టరాయన. అలాంటి వ్యక్తి తనయుడైన సుమంత్ తప్పకుండా హీరోగా సక్సెస్ అవుతాడు అన్నారు. ఇక వెంకటేష్ మాట్లాడుతూ...ఎమ్మెస్‌రాజు నాతో శత్రువు లాంటి మంచి సినిమా తీశారు. అభిరుచిగల వ్యక్తి ఆయన. ప్రతిభగల సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది అన్నారు. మరో నిర్మాత మాగంటి రామ్‌జీ మాట్లాడుతూ...తాతగారైన మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి, ఈవీవీ సత్యనారాయణ ఆశీస్సులతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టానని, సుమంత్ సింగిల్‌టేక్ ఆర్టిస్ట్ అని నిర్మాత ప్రశంసించారు.
ఇక ఎమ్.ఎస్ రాజు గతంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'మనసంతా నువ్వే'లోని 'తూనీగ... తూనీగ, ఎందాక పరిగెడతావె' పాటలోని పదాలుతో ఈ టైటిల్ ని సెంటిమెంట్ గా పెట్టారు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఫెరఫెక్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎమ్ ఎస్ రాజు తన కుమారుడు చిత్రాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారని వినికిడి. అలాగే తమ బ్యానర్ లో వర్షం,మనసంతా నువ్వే,నువ్వొస్తానంటే నే వద్దంటానా వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి ఉండటంతో ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని అంచనాలు ఉన్నారు. ఇక ఎమ్ ఎస్ రాజు వాన చిత్రంతో డైరక్టర్ గా మారారు. ఆయన రెండో చిత్రం ఇది.

Post a Comment