మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వరుసగా విజయవంతమైన చిత్రాలు రూపొందిస్తూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌తో దమ్ము చిత్రం రూపొందిస్తున్న ఆయన త్వరలో మహేష్ బాబుతో ఒక సినిమా, రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయడాని ప్లాన్ చేసుకుంటున్నాడు.
తాజాగా ఆయన సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం బోయపాటి త్వరలో ‘షేక్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ చిత్రాలను రూపొందించే బోయపాటి...తన సినిమాలకు ఉపయోగ పడుతుందనే ఆలోచనలో ఈ టైటిల్ రిజిస్టర్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను మున్ముందు తాను తీయబోయే సినిమాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహేష్, చరణ్‌లతో సినిమాల్లో ఏదో ఒకదానికి ఈ టైటిల్ పెట్టే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు బోయపాటి ఇటీవల మీడియాకు వెల్లడించారు. అయితే బోయపాటి శ్రీను తీసే సినిమాలకు, మహేష్ సినిమాలుకు చాలా డిఫెరెన్స్ ఉంటుంది. మహేష్ సినిమాలు కాస్త స్మూత్ గా నడిస్తే... బోయపాటి హీరోలు ఎప్పుడూ రఫ్ అండ్ టఫ్ గా బిహేవ్ చేస్తూంటారు. అయితే మహేష్ సైతం మాస్ మాసాలా సినిమాలనుకుంటున్న నేపధ్యంలో బోయపాటి శ్రీనుకి అవకాశమివ్వటం జరిగింది.
ఈ నేపధ్యంలో రీసెంట్ గా బోయపాటి శ్రీను.. మహేష్ ని కలిసి ఓ కథని నేరేట్ చేసాడని వినికిడి. కథ అంతా విన్న మహేష్ బాబు.. చెప్పే విధానాన్ని మెచ్చుకుని, తన సినిమాలు ఒక్కసారి చూడమని, తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేయమని, డైలాగులు సైతం తనకు అనుగుణంగా మార్చమని సలహా ఇచ్చినట్లు సమాచారం.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment