సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు‘కొచ్చాడయాన్’ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం 2007లో వచ్చిన హాలీవుడ్ హూవీ‘బివోల్ఫ్’ చిత్రానికి కాపీ అని, కథాంశంతో పాటు ఆ చిత్రానికి ఉపయోగించిన మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీనే ఈచిత్రానికి వాడుతున్నారని అంటున్నారు. ఇదే విషయమై కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించిన యూనిట్ సభ్యులు ఒకరు స్పందిస్తూ...సినిమా కథాంశం విషయంలో రెండు చిత్రాలకు సారూప్యత ఉన్నా మొత్తం కాపీ మాత్రం కాదంటున్నారు. ఆయన మాటలను బట్టి సినిమా సగం ఆ సినిమా నుంచి కాపీకొట్టిందేని స్పష్టం అవుతోంది.
ఓ దుష్టశక్తి బారి నుంచి ప్రపంచాన్ని రక్షించే పోరాట యోధుడిగా రజనీకాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన 30 ఏళ్ల యువకుడిగా కనిపిస్తాడు. ఆయన తక్కువ వయసు వాడిలా కనిపించడం కోసం అధునాతన టెక్నాలజీని వాడుతున్నారట.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే ‘ఖడ్గ రుద్ర’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ తారాగణమైన ఈ సినిమాకి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో తయారవుతున్న ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని లక్ష్మీగణపతి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం బి. అందిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment