Home »
TECH-TALK
» ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న ఇంటర్నెట్ సేవలు బంద్!
ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న ఇంటర్నెట్ సేవలు బంద్!
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఈ నెల 9న ఇంటర్నెట్ సేవలు బంద్ కానున్నాయి. యేడాది క్రితం అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాప్తి చేసిన మాల్‌వేర్ కారణంగా సోమవారం ఇంటర్‌నెట్ సేవల్లో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఇంటర్‌నెట్ సేవలకు ఆటంకం గురించిన అంశంపై గూగుల్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా హెచ్చరికలు చేశాయి. మాల్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కంప్యూటర్లలో ఇన్‌ఫెక్ట్ అయ్యాయి. ఈ మాల్‌వేర్‌ను ఆయా కంప్యూటర్ల నుంచి సోమవారంలోగా తొలగించకపోతే ఇంటర్‌నెట్ నిలిచిపోయే వీలుంది. మాల్‌వేర్‌ని తొలగించకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్‌ను తిరిగి పొందినట్లైతే భవిష్యత్తులో మళ్లీ సమస్యల రావచ్చని ఇంటర్నెట్ ప్రొవైడర్లు పేర్కొంటున్నాయి. హ్యాకర్లను అణిచేయడానికి ఎఫ్‌బీఐ ప్రయత్నించినా, ఇన్‌ఫెక్ట్ అయిన కంప్యూటర్లను నియంత్రించేందుకు ఉపయోగించిన దోషపూరిత సర్వర్లను నిలిపేస్తే బాధితులందరూ ఇంటర్‌నెట్ సేవలను కోల్పోనున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్‌బీఐ ప్రత్యేకంగా ఒక సేఫ్టీనెట్‌ను ఏర్పాటు చేసింది. తాత్కాలికంగా రెండు కొత్త ఇంటర్‌నెట్ సర్వర్లనూ ప్రారంభించారు. అయితే ఈ తాత్కాలిక సర్వర్ల కాల పరిమితి ఈ నెల 9న ముగియనుండటంతో నెట్ సేవలకు అంతరాయం కలుగనుంది.
Post a Comment